Sunday, December 22, 2024

రేవంత్ రెడ్డికి కెటిఆర్ చురక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బిజెపిలో బిఆర్ఎస్ విలీనం కాబోతుందని, కెసిఆర్ గవర్నర్, కెటిఆర్ కేంద్రమంత్రి కాబోతున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు.

బిఆర్ఎస్ విలీనమంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా,  కెటిఆర్ మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి చెప్పినటుంటి స్టోరీలు తాను కూడా చాలా చెప్పగలనన్నారు.

”  రేవంత్ రెడ్డి తొందరలోనే అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. మనోడు అమెరికా అధ్యక్షుడు అవుతాడని.. మొన్ననే కెజిఎఫ్‌లో  ఏదో మీటింగ్‌ పెట్టి ఆయనెవరో చెప్పారు కదా…  అవుతాడేమో మరి. ట్రంప్‌ సరిపోవడం లేదని.. రేవంత్‌ను పిలుస్తున్నారేమో” అంటూ  వ్యంగ్యంగా చెప్పకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News