Monday, March 31, 2025

ఎస్‌ఎల్‌బిసి విఫల డిజైన్

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ ఏనాడో చెప్పారు హస్తిన యాత్రలు మాని
టన్నెల్‌లో చిక్కుకున్న వారి గోడు వినాలి అవి
సాధారణ ప్రాణాలు కావు, జాతి సంపద కెటిఆర్ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకే టి సిగ్గు అన్నాదట అనే సామెతలా ఉం ది రేవంత్ రెడ్డి వ్యవహారం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఎస్‌ఎల్‌బిసి ప్ర మాదం జరిగితే, బాధ్యతగల ముఖ్యమంత్రే అయితే రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్టి పెట్టేవారని వ్యాఖ్యానించారు. ఎ న్నికలు, ఢిల్లీ టూర్లు అంటూ తిరిగే రేవంత్‌రెడ్డికి పాలన అంటే ఏంటో తెలుసా..? అని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బిసి ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కెసిఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కాదు..ఆ వీడియో చూడు..కొంచెమయినా విషయ పరిజ్ఞానం వస్తుందని సిఎంకు సూచించారు. అయినా పనులు ఆగిపోవడం వల్ల, బే రింగులు పనిచెయ్యడం లేదు అని అనడం ఏంటని ప్రశ్నించారు. అసలు పనులు మొదలు పెట్టడానికి ముందు టెక్నికల్ అసెస్మెంట్, జిఎస్‌ఐ సర్వే ఏమన్నా చేశారా..గుడ్డిగా కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారా..? అని నిలదీశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తే దాని గురించి మాట్లాడడం మానేసి, ఈ పనికిమాలిన లీకులు, అక్కరకు రాని చిట్ చాట్లు దేనికి..? అని సిఎం రేవంత్‌రెడ్డికి కెటిఆర్ ప్రశ్నించారు.

36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదు
36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఎస్‌ఎల్‌బిసి సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగి తేలారని, మూడు నెలలుగా జీతాల్లేక అల్లాడుతున్నామని కార్మికులు వాపోతుంటే ఎన్నికల ప్రచారం ముగించుకుని నిమ్మలంగా మళ్లీ హస్తిన బాటపట్టారని ఎక్స్ వేదికగా విమర్శించారు. సొరంగంలో సహాయక చర్యలు ఒక్కడుగు ముందుకు .. వందడుగులు వెనక్కి అన్నట్లుగా ఉందని పేర్కొన్నారు.

అక్కడ ఆక్సిజన్ లేదు…కన్వేయర్ బెల్టు తెగిపోయింది..96 గంటలు దాటినా ఒక్కడుగూ ముందుకు పడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం పర్రెల మీద శ్రీశైలం అగ్నిప్రమాదం మీద కారుకూతలు కూసి, విషపు రాతలు రాసిన మేధావుల నోళ్లు ఎస్‌ఎల్‌బిసి విషయంలో మాత్రం నోరెత్తడం లేదని మండిపడ్డారు. హస్తిన యాత్రలు మాని ఆ కార్మికుల గోడు వినాలని, ఆ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. అక్కడ చిక్కుకున్నవి సాధారణ ప్రాణాలు కాదు .. ఈ జాతి సంపద అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News