Thursday, January 23, 2025

ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య పోటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం పర్యటనకు వెళ్తానంటున్న రాహు ల్‌గాంధీ అక్కడికి వెళ్లి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ గురించి పాఠాలు నేర్చుకోవా లని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సూచించారు. కాళేశ్వ రం వద్ద ఏదో జరిగిదంటూ అక్కడి వెళ్లానంటున్న రాహుల్‌గాంధీ ఆ ప్రాజెక్టు ను చూసి నేర్చుకోవాలని అన్నారు. ప్రపం చంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది తమ నాయకుడు కెసిఆర్ అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్షల ఎ కరాలకు నీళ్లు అందిస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఈ ఎన్నికలు తెలంగాణ దొరలకు, తెలంగాణ ప్రజల కు మధ్య పోటీ అని అంటున్నారని.. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు నా లుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే పోటీ కెటిఆర్ రాహుల్ గాం ధీకి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో బుధవారం కెటిఆర్ సమక్షంలో కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కల వెంగళరావు తన అనుచరులతో బిఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి కెటిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి బిఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంఎల్‌ఎ మాధవరం కృష్ణారావు, ఎంఎల్‌సి నవీన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, రాహుల్‌గాంధీ తాత జవహార్‌లాల్ నెహ్రూ బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపాడని, 1956లో నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. అలా తెలంగాణను ఆంధ్రలో కలపటం వల్ల 56 యేళ్లు తెలంగాణ గోస పడ్డదని పేర్కొన్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ నాయనమ్మ వల్ల వందల మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని, ఢిల్లీ దొరల కారణంగా వేల మంది బలిదానం చేసుకున్నారని అన్నారు. ఆ తర్వాత రాహుల్ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పి తమతో పొత్తుపెట్టుకుని పదేళ్లు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదని, దాంతో ఎంతోమంది బలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని భావించి అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందని చెప్పారు.
తెలంగాణ తల వంచదు…తల దించదు
తెలంగాణకు పోరాటం చేయడం కొత్త కాదు అని, ప్రత్యేక రాష్ట్రం కోసం అప్పుడు కాంగ్రెస్ దొరలతో,ఇప్పుడు బిజెపి దొర ప్రధాని మోడీతో పోరాడుతున్నామని కెటిఆర్ అన్నారు. ఢిల్లీ అహంకారానికి తెలంగాణ తల వంచదు, తల దించదు అని స్పష్టం చేశారు. ఓటుకు నోటుకు దొంగను పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవడెవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే వ్యక్తి రాహుల్ గాంధీ లీడర్ కాదు…రీడర్ అని విమర్శించారు. టికెట్లు అమ్ముకునే చిల్లరగాల్లకు పదవులు ఇచ్చే రాహుల్ గాంధీ తమకు నీతులు చెప్పనవరసరం లేదని మండిపడ్డారు.

కెసిఆర్ పాలనలో పల్లెలు, పట్టణాలు అభివృద్ది చెందాయి
సిఎం కెసిఆర్ నాయకత్వంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ది చెందాయని కెటిఆర్ తెలిపారు. కెసిఆర్ ఎక్కడ సభ పెట్టినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ లక్షల మంది తరలివస్తున్నారని చెప్పారు. మళ్ళీ కెసిఆరే సిఎం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. మళ్ళీ బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి అన్నపూర్ణ పథకం ద్వారా దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం ఇస్తామని, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు రూ.3 వేల భృతి ఇస్తామని,రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 46 లక్షల మంది ఆసరా పెంఛన్లు పొందుతున్నారని, వారికి పెన్షన్‌ను రూ.2016 నుంచి రూ.5016కు పెంచుతామని తెలిపారు.

తమది పేదల ప్రభుత్వం అని, సంపద పెంచాలె..పేదలకు పంచాలె అనేదే తమ విధానమని వ్యాఖ్యానించారు. సిఎం కెసిఆర్ పాలనలో హిందూ ముస్లీం గొడవలు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు లేవని కెటిఆర్ పేర్కొన్నారు. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ఎలాంటి గొడవలు లేకుండా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నగరంలో మౌలిక వసతులు పెంపొందించి, ప్రజల అవసరాల మేరకు బ్రిడ్జిలు నిర్మించామని, అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే కూకట్‌పల్లి ఎంఎల్‌ఎ మాధవరం కృష్ణారావు ఈ సారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కెటిఆర్ కోరారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News