Sunday, December 22, 2024

వృద్ధురాలికి పింఛన్ తిరిగిచ్చేయాలని రికవరీ నోటీసు ?!

- Advertisement -
- Advertisement -

మండిపడ్డ కెటిఆర్

హైదరాబాద్: దాసరి మల్లమ్మ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు. అయితే ఆమెకు ఇచ్చిన పింఛను తిరిగి ఇవ్వాలంటూ రికవరీ నోటీసు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం. దీనిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో దీనికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టారు. మల్లమ్మకు ప్రభుత్వం పంపిన నోటీసును, ఆమె ఫోటోతోపాటు జత చేశారు. అనర్హులైనప్పటికీ రూ. 172928ని పొందినందుకు ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం పేరిట ఆమెకు రికవరీ నోటీసు పంపినట్టు అందులో రాసి ఉంది.

ప్రభుత్వం ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ దారులకు డబ్బును ప్రభుత్వానికి వాపస్ ఇవ్వాలని నోటీసులు పంపుతున్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పింఛన్లను రేవంత్ ప్రభుత్వం లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. పేదలపై ఇటువంటి దుర్మార్గపు చర్యలను ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు.

2017 నుంచి మల్లమ్మ డిపెండెంట్ పెన్షన్ పొందుతున్నారు. వైద్య శాఖలో పనిచేసిన మల్లమ్మ కుమార్తె 2017లో మరణించడంతో నాటి నుంచి ఆమెకు ఈ పింఛను దక్కుతోంది. అయితే ఆమె కుమార్తె ప్రభుత్వ ఉద్యోగం చేసినందున పింఛను పొందే అర్హత మల్లమ్మకు లేదని అధికారులు వాదిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News