- Advertisement -
హైదరాబాద్: బిజెపి నేతలపై మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో విమర్శలు సంధించారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబర్ 15 లోపు వస్తుందని బిజెపోళ్లకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కంటే ముందే బిజెపోళ్లు తేదీలను ఎలా ప్రకటిస్తారని అడిగారు. దర్యాప్తు సంస్థలు ఇడి, సిబిఐ, ఐటి, ఎన్‌ఐఎ కంటే ముందే సోదాలు వివరాలు, నగదు వివరాలు, పేర్లు ఎలా? వెల్లడిస్తారని బిజెపోళ్లను నిలదీశారు. బిజెపి తన పార్టీ పేరును బిజెపి ని “బిజె- ఇసి, సిబిఐ, ఎన్‌ఐఎ, ఐటి, ఇడి- పి”గా మార్చుకోవాలని చురకటించారు. ఈ క్రమంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ భన్సల్ ఈ నెల 15లోపు మునుగోడు ఉప ఎన్నికల నోటిపికేషన్ వస్తుందని చెప్పిన విషయం తెలిసిందే.
- Advertisement -