Wednesday, January 15, 2025

ఎల్‌బి స్టేడియంలో కెటిఆర్ కప్ పోటీలు

- Advertisement -
- Advertisement -

KTR Cup matches at LB Stadium

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యమిస్తూ.. క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నామని రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం రాష్ట్ర పురపాలక, పరిశ్రమల ,ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం (జులై 24) పురస్కరించుకుని లాల్ బహదూర్ స్టేడియంలో టిఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కెటిఆర్ కప్‌ను శాసనసభ్యులు గాదరి కిషోర్, నోముల భగత్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. పోటీలు సోమవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆరు రోజుల పాటు జరగనున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్, సతీష్ రెడ్డి, టిఆర్‌ఎస్‌వి నాయకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్ధి సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News