Monday, January 20, 2025

రాహుల్‌ గాంధీ.. అశోక్‌ నగర్‌కు వచ్చి యువతను కలవండి: కెటిఆర్ డిమాండ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సమయంలో 2లక్షల ఉద్యోగాలని నమ్మించిన రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చి అశోక్‌నగర్ యువతను కలవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. యువతకు ఇచ్చిన హామీని ఎలా నెరవేరుస్తారో చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చి అశోక్‌నగర్‌లోని యువతకు ఇచ్చిన హామీని ఎలా నెరవేరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీనుద్దేశించి ఎక్స్‌లో ఎనిమిది నెలలు అయినా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడంతో యువత ఆందోళన చేస్తోందని పెర్కొన్నారు. జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చారని విమర్శించారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాటలు నమ్మి తెలంగాణ యువత కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారు. ఈ మేరకు నవంబర్ 27,2023న రాహుల్‌గాంధీ ట్వీట్‌ను కూడా ఆయన రీ ట్వీట్ చేశారు.

పోరాటాలు మాకు కొత్తేం కాదు
పోరాటాలు బీఆర్‌ఎస్‌కు కొత్తేం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు. బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటామని, నిలదీస్తూనే ఉంటామని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ‘పోరాటం మాకు కొత్త కాదు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతం. వదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. జై తెలంగాణ అంటూ తన అరెస్టుకు సంబంధించిన ఫొటోలను జత చేశారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో యువతను కలిశారు. పోటీ పరీక్షల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ’దొరల’ కెసిఆర్ సర్కార్ కింద తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాను హైదరాబాద్ అశోక్‌నగర్‌లో సెంట్రల్ లైబ్రేరీలో నిరుద్యోగులను కలిశారని తెలిపారు.

అనంతరం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గురించి విపులంగా తెలుసుకున్నారని తన ఎక్స్(ట్వీట్టర్) వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. నిరుద్యోగ యువత బాధను తగ్గించేందుకు తమ కాంగ్రెస్ ‘ఉద్యోగ క్యాలెండర్’తో తొలి అడుగు ముందుకు వేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఇచ్చారు. యూపీ ఎస్సీ మాదిరి టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. యువ వికాసం కింద విద్యార్ధులకు రూ.5 లక్షల సహాయం.. యువత భవిష్యత్తు కాంగ్రెస్ ప్రజా సర్కార్ చేతిలో భద్రంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు తమదే గ్యారెంటీ! అని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News