Monday, December 23, 2024

రైతుకు వెన్నుదన్ను బిఆర్‌ఎస్సే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో/జడ్చర్ల/మూసాబ్‌పేట: రైతన్నకు వెన్నుదన్నుగా నిలబడింది బి ఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి కెటిఆర్ అన్నారు. జడ్చర్లలో డబుల్ బెడ్ రూంలు పేదలకు పంపి ణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కె టిఆర్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేసిందేమి లేదన్నారు. పేదల దగ్గర ఒక్క రూ పాయి తీసుకోకుండా ఉచితంగా డబుల్ బెడ్ రూంలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నా రు. తెలంగాణ ఏర్పడక ముందు రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారని, సమైక్య రాష్ట్రంలో కనీసం 6గంటలు కూడా కరెంటు కూడా రెండుసార్లు ఇచ్చే వారన్నారు.

తెలంగాణ రాష్ట్ర అనంతరం రైతు అరిగోసను చూసి వెన్నుదన్నుగా నిలిచారన్నారు. 24 గంట ల ఉచిత విద్యుత్, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, రై తు పెట్టుబడికి రైతుబందు, రైతు మరణిస్తే రైతు బీమా వంటి ఎన్నో పథకాలు ఇచ్చిన మహా నేత కెసిఆర్ అని తెలిపారు. మిషన్ కాక తీయ ద్వార చెరువుల మరమ్మతులు చేయించడం, ప్రాజెక్టులను పూర్తి చేయడంతో సాగునీటి జలకళ బ్రహ్మాండగా పెరిగిందన్నారు. దీంతో ఒకప్పటి కరువు తెలంగాణాలో నేడు ధాన్య రాశుల తెలంగాణగా మారడంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ కృషి ఎంతో ఉందన్నారు.

ఉదండాపూర్ రిజర్వాయర్ పూర్తి కాకుండా కాం గ్రెస్ అడ్డుకుంటోందని అయినప్పటికీ పూర్తి చేసి తీరుతామని చెప్పారు. కర్వేన రిజర్వాయర్‌కు ఆగస్టులో నీరు అందిస్తామని మంత్రి చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే పాలమూరు సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రవి నాయక్, ఎంఎల్‌ఎలు లకా్ష్మరెడ్డి, గువ్వల బాలరాజు, ఎంఎల్‌సి కసిరెడ్డి జనార్దన్ రెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News