Wednesday, January 22, 2025

కెసిఆర్ గెలుపు.. అభివృద్ధి మలుపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ బిక్కనూర్/నిజామాబాద్‌బ్యూరో: దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణను అభివృద్ధ్ది చేసిన సిఎం కెసిఆర్‌ను ప్రజలు ఆశీర్వదించి మరొక్కసారి గెలిపించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తా రకరామారావు పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గం బిక్కనూర్ మండలానికి హెలిక్యాప్టర్ ద్వారా వచ్చిన మంత్రి కెటిఆ ర్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు అభివాదం చేసి రో డ్ షోలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో రూ. 200 పింఛన్ వచ్చేదని తెలంగాణ ప్రభు త్వం ఏర్పడిన తరువాత రూ. 2 వేలకు పెంచామన్నారు. అదే విధంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 2 వేల నుంచి రూ. 3 వేలుకు ఆ తరువాత రూ. 5 వేలుకు పెంచుతామన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీడీ కార్మికులకు, ఒంటిరి మహిళలకు పింఛన్లు వచ్చేవా అని ప్రశ్నించారు. దే శంలో 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉన్నారని కానీ ఏ రా ష్ట్రంలోని పింఛన్లు అందటం లేదని ఒక్క తెలంగాణలో అందజేస్తున్నామన్నారు. మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సౌభాగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని కెటిఆర్ అన్నారు.

సిఎం కెసిఆర్ పాలనలో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించిందన్నారు. అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధిని చూస్తూ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బిజెపిలు చేస్తున్న ఆరోపణలు సమంజసం కాదన్నారు. ఎన్నికల్లో ఇ లాంటి ఆరోపణలు సహజమని, ప్రజలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధ్ది తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని సిఎం కెసిఆర్ చేపటి న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలుసని చెప్పారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డి నియోజకవర్గం నుం చి పోటీ చేయడం మన అదృష్టమని కామారెడ్డిలో ఆయనకు భారీ మెజారిటీతో గెలిపించుకుని మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరారు. నవంబర్ 30 జరిగే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి కెసిఆర్‌ను గెలిపించుకుని ఆయనకు ఈ విజయాన్ని బహుమతిగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ యన వెంట ప్రభుత్వ విప్ గంపగోవర్దన్, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బిఆర్‌ఎస్‌తోనే నిజామాబాద్ నగరాభివృద్ధి
నిజామాబాద్ నగరంలో శనివారం బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిజామాబాద్‌లో ఐటి హబ్ ఎవరు కట్టారని, సమీకృత కలెక్టర్ కార్యాలయం ఎవరు కట్టారని, మన యువతకు స్కిల్స్ నేర్పించేందుకు న్యాక్ భవనం ఎవరు కట్టారని, అర్బన్ ఎమ్మెల్యే అ భ్యర్థి గణేష్ బిగాల, ముఖ్యమంత్రి కెసిఆర్‌తో నిధులు మంజూ రు చేసుకుని నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారన్నారు. కరోనా వచ్చినప్పుడు ప్రజలను అందుకున్నారని, నిరుపేదల కు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కు మీకు కొత్త బట్టలు పె ట్టింది గణేష్‌బిగాల అని అన్నారు. నిజామాబాద్‌లో ప్రతి గల్లీ, ప్రతి వీధి ఎమ్మెల్యేకు తెలు సునని అన్నారు. షబ్బీర్ అలీ గెలి స్తే మీకు పని పడితే ఎక్కడికి పోతారని ఒక్కసారి మీరు ఆలోచించాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి జరగని అ భివృద్ధి 9 సంవత్సరాలలో గణేష్ బిగాల చేసిన అభివృద్ధి మీ ముందు ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కామారెడ్డి, ఎల్లారెడ్డి లో 9సార్లు పోటీ చేస్తే 7 సార్లు ఓడిపోయారని అన్నారు.

కా మారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని అన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో హిందువులు, ముస్లిం లు, క్రిస్టియన్‌లు, జైన్లు అందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వచ్చి మైనారిటీలు పేద వాళ్ళు అంటాడు మరి 55 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు బిఆర్‌ఎస్ పార్టీ బిజెపి రెండు ఒకటే అంటారు కానీ ఇప్పటి వరకు కెసిఆర్ బిజెపితో పొత్తు పెట్టుకోలేదని అన్నారు. బిజెపి పార్టీతోని మోడీని ఢీకొట్టే దమ్ము కేవలం బిఆర్‌ఎస్ పార్టీకే ఉందన్నారు. 9 సంవత్సరాలలో గణేష్ బిగాల చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉంది. అభివృద్ధిని చూసి మీరు గణేష్ బిగాలని గెలిపిస్తే నిజామాబాద్ నగరాన్ని మరింత ముందుకు తీసుకవెళ్తురని పేర్కొన్నారు. మరోసారి కెసిఆర్‌ను, బిగాలను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపి కెఆర్. సురేష్‌రెడ్డి, నగర మేయర్ దండునీతూకిరణ్, రెడ్‌కో మాజీ చైర్మన్ ఎస్‌ఎ. అలీం, మీర్ మాజాజ్ అలీ, నవీద్, ఇక్బాల్ అబ్దుల్ కుద్దుస్, కరీముద్దీన్, బాబ్ల్యూ ఖాన్, బబ్బు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News