Sunday, January 19, 2025

కాంగ్రెస్ వస్తే మళ్లీ పట్వారీ వ్యవస్థే

- Advertisement -
- Advertisement -

బీబీపేట : కాంగ్రెస్ నాయకులు ధరణి ఎత్తేసి, పట్వారీ వ్యవస్థను తీసుకరావాలని చూస్తున్నారని అలా జరిగితే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు అన్నారు. పట్వారీ వ్యవస్థ రద్దు, ధరణి ముద్దు అనే వాళ్లు బిఆర్‌ఎస్‌కు ఓటు వేసి సిఎం కెసిఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు. శనివారం కామారెడ్డి నియోజకవర్గం బిక్కనూర్ మండలంలోని పెద్ద మల్లారెడ్డి, కాచాపూర్ గ్రామాలలో నిర్వహించిన రోడ్డు షో కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణలో మొత్తం రైతులకు రూ. 19 వేల కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, మిగిలిన బకాయి రూ. 7000 కోట్ల రూపాయలను 29వ తేదీలోపే రుణమాఫీ చేసి రైతులకు బాసట నిలుస్తామన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ కావాలంటే కోసిఆర్ ఓటు వేయాలని కోరారు. ధరణి వల్ల 90 శాతం మందికి మంచి జరిగిందని మిగిలిన ఆ పది శాతాన్ని కూడా అధికారంలోకి వచ్చాక సరిచేసుకుందామని కెటిఆర్ అన్నారు. ఎప్పటికైనా మనోడు మనోడేనని, మందోడు మందోడే అవుతాడని తెలంగాణ రాష్ట్రం మీద సిఎం కెసిఆర్‌కు ఉన్న ప్రేమ రాహుల్ గాంధీకి ఉంటుందా అని కెటిఆర్ ప్రశ్నించారు.

కామారెడ్డిలో పోటీ చేస్తున్న సిఎం కెసిఆర్ గెలిపించుకుంటే మీరు ఊహించనందగా కామారెడ్డి అభివృద్ధి జరుగుతుందని కెటిఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే కాళేశ్వరం నీళ్లు మంచిప్ప దాకా వచ్చాయని రానున్న రోజుల్లో అవి మీదాకా తీసుకొచ్చ బాధ్యత నాది అని కెటిఆర్ హామీ ఇచ్చారు. మీరు కెసిఆర్‌ను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటువేయాలని కెటిఆర్ కోరారు. పెద్ద మల్లారెడ్డికి వస్తుంటే వడ్ల కుప్పలు కనిపించాయని ఇదే కాంగ్రెస్ పాలనలో ఈ విధంగా వడ్ల కుప్పలను చూశామా అని కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ సరిగా లేక నానా అవస్థలు పడ్డామని మళ్లీ అలాంటి రోజులను తీసుకరావద్దని ప్రజలకు కెటిఆర్ సూచించారు. కాంగ్రెస్ పాలనలో బీడీ కార్మికులను పట్టించుక్ను దాఖలాలు లేవని అదే బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో వారు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు కెసిఆర్ అందిస్తే పింఛన్లతో వారు దర్జాగా జీవిస్తున్నారన్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి అంటే తల్లిదండ్రులు భయపడేవారని కానీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో వారికి కొండంత అండగా నిలినాయమన్నారు. అధికారంలోకి రావడానికి కల్లబొల్లి మాయమాటలు చెప్పి నమ్మించేందుకు ప్రజల వద్దకు ప్రతిపక్షాల పార్టీల నాయకులు వస్తారని ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని కెటిఆర్ అన్నారు.

ప్రతిపక్షాలైన బిజెపి పార్టీ వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి పేదల నడ్డి విరిచిందని, అనేక ఏళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలు ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు పల్లెలన్నీ ఎట్లుండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయని ప్రజలు మీరే ఆత్మ పరిశీలన చసుకోవాలన్నారు. తమది రైతు ప్రభుత్వమని, అభివృద్ధ్ది, సంక్షేమం, ప్రభుత్వ లక్షమని ఎక్కడడా లేని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధిని చూసి కెసిఆర్‌ను ప్రజలు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారని, మరింత అభివృద్ధి చేసుకోవడానికి కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న సిఎం కెసిఆర్‌ను మూడోసారి గెలిపించుకుని అభివృద్ధి తోడ్పడాలని కో రారు. ఈ కార్యక్రంలో ఎమ్మెల్యే గంపగోవర్దన్, ఎమ్మెల్సీ షేర్ సుభాష్‌రెడ్డి, ఎంపి బిబిపాటిల్, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎంపిపి గాల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News