Sunday, January 26, 2025

మహిళల కోసం కెసిఆర్ కొత్త పథకం

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: మహిళల కోసం సిఎం కెసిఆర్ కొత్త పథకం తీసుకువస్తున్నారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తామని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు మూడు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని మోడీ చెప్పారు. మోడీ చెప్పిన రూ. 15 లక్షలు వచ్చిన వారు బిజెపికి ఓటు వేసుకోవచ్చని ఆయన సూచించారు. రూ. 400 గ్యాస్ సిలిండర్ ను మోడీ రూ. వెయ్యికి పెంచారు. బిఆర్ఎస్ మళ్లీ గెలిస్తే రూ. 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని తెలిపారు. రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికి రూ. 5 లక్షల జీవిత బీమా అందిస్తామని మంచిర్యాల జిల్లా ఖానాపూర్ నియోజగవర్గం జన్నారంలో ఎన్నికల ప్రచార సభలో కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News