Wednesday, January 8, 2025

కెటిఆర్ భావోద్వేగం.. కుమారుడిని మిస్సవుతున్నానంటూ నెట్టింట పోస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ఎన్నికల హడావిడి కొనసాగుతున్నా, సభలు, సమావేశాలలో చాలా బిజీ బిజీగా ఉంటున్నా కూడా తండ్రిగా తన బాధ్యతను ఎప్పుడు నిర్వర్తిస్తూనే ఉన్నారు మంత్రి కెటిఆర్. పిల్లల పైన అమితమైన ప్రేమను వ్యక్తం చేస్తూ, వారు సరైన మార్గంలో పెరగడానికి తండ్రిగా పాటు పడుతున్నారు. ఇటీవల ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది ఆగస్టులో కెటిఆర్ తనయుడు హిమాన్షు అమెరికా వెళ్లారు. ఆగస్టులో అమెరికా వెళ్లిన హిమాన్షుని వదిలి ఉండటం కష్టం అని అప్పుడే మంత్రి కెటిఆర్ ఎమోషనల్ అయ్యాడు. తాజాగా కొడుకుపై బెంగ పెట్టుకున్న కెటిఆర్ బుధవారం సోషల్ మీడియా వేదికగా కొడుకుతో కలిసి నడుస్తూ దిగిన ఒక ఫోటోను పెట్టి బిడ్డను మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్ పెట్టారు. ట్విట్టర్ లో కెటిఆర్ పెట్టిన పోస్ట్ ఆయనకు కొడుకు పై ఉన్న ప్రేమను అర్థమయ్యేలా చెబుతుంది. తాను చేసిన పోస్టుకు మిస్సింగ్ దిస్ కిడ్ అని క్యాప్షన్‌ని కెటిఆర్ జోడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ బాగా బిజీగా ఉన్న ఈ సమయంలో కూడా మంత్రి కెటిఆర్ తన తనయుడు హిమాన్షును గుర్తు చేసుకున్నారు.

నీ కొడుకునైనందుకు గర్యిస్తున్నా నాన్నా.. హిమాన్షు స్పందన
ఇక తండ్రి కెటిఆర్ చేసిన ట్వీట్ కు హిమాన్షు స్పందించారు. నేను మీ కొడుకు అయినందుకు గర్విస్తున్నాను అంటూ పేర్కొన్న హిమాన్షు, రోజుకు ఒకసారి మిమ్మల్ని కలవడం నుండి మీతో వర్చువల్ గా చూసి మాట్లాడటం చాలా అసాధారణంగా ఉందని, వారానికి ఒకసారి మీతో కలిసి భోజనం చేయడం నుండి నెలల తరబడి మీతో కలిసి భోజనం చేయడానికి ఆరాటపడడం తనకు కష్టంగానే ఉందని పేర్కొన్నారు. మీరు చెప్పినట్టుగా విజయం త్యాగాన్ని కోరుకుంటుంది అనేది ఇన్నేళ్ల మీ ప్రస్థానానికి నిజమైన గీటు రాయిలా నిలుస్తుందని పేర్కొన్నారు. మెరుగైన వ్యక్తిగా మారడానికి, మంచి చేయడానికి ఇది నాకు అతి పెద్ద ప్రేరణగా ఉంటుందని హిమాన్షు ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్ లు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ప్రేమను కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News