Monday, December 23, 2024

అమ్మమ్మ సంతోషపడటం ఖాయం…మంత్రి కెటిఆర్ ఎమోషనల్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఓ పాఠశాలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. తన అమ్మమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థం కామారెడ్డి నియోజకవర్గం కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం పూర్తి చేశామని మంత్రి కెటిఆర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పాఠశాల నిర్మాణం పూర్తి అయిన విషయం తన అమ్మమ్మకు తెలిస్తే చాలా సంతోషపడుతుందన్నారు. ఏడాది తిరిగే లోపే భవనం సిద్ధం కావడంతో కోనాపూర్ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని హంగులతో రూపుదిద్దుకున్న స్కూల్ కట్టిన మంత్రి కెటిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

స్కూల్‌ను చూసి పైలోకంలో తన అమ్మమ్మ తప్పకుండా కచ్చితంగా సంతోషిస్తారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. త్వరలో ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ఆ బిల్డింగ్ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి అమ్మమ్మను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆమెకు అమితమైన సంతోషం కలిగే సందర్భం ఇదని చెప్పారు. కాగా వారం రోజుల్లో తల్లి శోభమ్మతో కలిసి మంత్రి కెటిఆర్ స్కూల్‌ను ప్రారంభిస్తారని బిఆర్‌ఎస్ స్థానిక నాయకులు చెబుతున్నారు. అయితే ‘మన ఊరు మన బడి’ పథకం కింద ఈ పాఠశాలకు మంత్రి కెటిఆర్ గతంలో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పాఠశాల నిర్మాణాన్ని ఆయన ముందుండి నడిపించారు.

ఆయన అమ్మమ్మ స్వస్థలమైన కోనాపూర్‌లో ఈ పాఠశాల భవనాన్ని తన సొంత డబ్బులతో నిర్మించారు. ఈ భవనంలో రెండు అంతస్తుల్లో 14 తరగతి గదులున్నాయి. కాగా, ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి కెటిఆర్ శంకుస్థాపన సమయంలోనే చెప్పారు. అన్న మాట ప్రకారం పాఠశాల నిర్మాణం పూర్తి అయిందని ఆయన ట్వీట్ చేశారు. దీన్ని రెండున్నర కోట్లతో నిర్మించారు. త్వర లోనే ప్రారంభించనున్నారు. ప్రస్తుతం స్కూల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News