Wednesday, January 15, 2025

రాఖీ పండుగ నాడు జైల్లో కవిత.. భావోద్వేగానికి గురైన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాఖీపౌర్ణమి పండుగ సందర్భంగా మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ భావోద్వేగానికి గురయ్యారు.  ఈ మేరకు ఎక్స్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.  ‘నువ్వు ఇవాళ రాఖీ కట్టకపోయినా నీ కష్టసుఖాల్లో నేను తోడుగా ఉంటాను’ అని ట్వీట్ చేశారు. గతంలో కవిత రాఖీ కట్టినప్పటి ఫోటోతోపాటు ఆమె జైలుకు వెళ్తున్నప్పటి ఫొటోను షేర్ చేశారు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. తర్వాత సిబిఐ కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లో పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ఆమె తిహార్ జైలులో ఉన్నారు. రేపు బెయిల్ పిటిషన్ పై మరోసారి ఢిల్లీ కోర్టులో విచారణ జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News