Wednesday, January 1, 2025

కెటిఆర్ తండ్రి చాటు కొడుకు!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కెటిఆర్ తండ్రి చాటు కొడుకని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సెటైర్ వేశారు. బిఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే హరీష్‌ రావు కూడా బిజెపిలో చేరేవారని ఆయన అన్నారు. శనివారం అసెంబ్లీలో నిర్వహించిన దివంగత స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలకు ఆ యన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కెటిఆర్ మాదిరిగా తండ్రి పేరుతో తాను రాజకీయాల్లోకి రాలేదని ఉద్యమాలు చేసి వచ్చాన ని తెలిపారు. మేం జీరో బిల్ ఇచ్చినట్లుగా కెటిఆర్‌కు జీరో నాలెడ్జ్ ఉందన్నారు. నాలెడ్జ్ లేని కెటిఆర్ గురించి మాట్లాడటం వృథా అని,కాళేశ్వరం కట్టించిన చీఫ్ డిజైనర్ కెసిఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.
రాహుల్‌ను గెలిపించుకుంటాం
లోక్‌సభ అభ్యర్థులపై ఇంటర్నల్ సర్వే జరుగుతోందని ఆయన అన్నారు. భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీని కోరామని ఆయన చెప్పారు. భువనగిరి, నల్లగొండ, ఖ మ్మం నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సౌత్ ఇండియాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యతను తాము తీసుకుంటామని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం యాదాద్రి పేరు మార్పుపైనా మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ఇక నుంచి యాదాద్రి కాదని, యాదగిరిగుట్టగానే పరిగణిస్తామని ఆయన అన్నా రు. అతి త్వరలో యాదగిరిగుట్టగా మారుస్తూ జీఓ విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
శ్రీపాదరావు జయంతి వేడుకలు అధికారికంగా జరపడం సంతోషం
దివంగత స్పీకర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆలస్యమైనా శ్రీపాదరావు జయంతి వేడుకలు అధికారికంగా జరపడం సంతోషంగా ఉందన్నారు. నక్సల్లో దాడిలో చనిపోయిన శ్రీపాదరావు అజాత శత్రువని ఆయన కొనియాడారు. తాను ఎన్‌ఎస్‌యూఐలో ఉన్నప్పటి నుంచి శ్రీపాదరావుతో తనకు అనుబం ధం ఉందని కోమటిరెడ్డి గుర్తు చేసుకున్నారు. శ్రీపాదరావు పేరును ఆయన కొడుకు, మంత్రి శ్రీధర్‌బాబు నిలబెడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News