Wednesday, December 4, 2024

పేద విద్యార్థినికి కెటిఆర్ ఆర్థిక చేయూత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఓ పేద విద్యార్థినికి చేయూతనందించారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన అన్నపూర్ణ ఓ పేద మహిళ. కుమార్తెను చదివించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెసిఆర్, కెటిఆర్‌ను కలవడానికి ఆమె హైదరాబాద్ వచ్చారు. అన్నపూర్ణ పరిస్థితి గురించి తెలుసుకున్న కెటిఆర్ చలించిపోయారు. ఆమె కుమార్తెకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు అన్నపూర్ణకు సొంతంగా రూ.1 లక్ష అందించారు. కుమార్తెను బాగా చదివించాలని సూచించారు.

కెటిఆర్ నుంచి ఆర్థికసాయం అందుకున్న అన్నపూర్ణ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను బిఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. అన్నపూర్ణను ప్రజాదర్బార్ పొమ్మంటే బిఆర్‌ఎస్ పార్టీ ఆదుకుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల పాటు హడావిడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికే పరిమితమైనట్టు కనిపిస్తోందని బిఆర్‌ఎస్ విమర్శించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News