Thursday, November 21, 2024

ఎపికి నిధుల వరద.. తెలంగాణ ముఖాన బురద: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే
8 మంది బిజెపి ఎంపీలుంటే రూ.8లు కూడా రాలేదు
బీహార్, ఎపి బడ్జెట్‌లా ఉందంటూ కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ కేటాయింపులపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపిలను ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు రూ.8 లు కూడా కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి మొండిచేయి చూపించారని, బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకర మన్నారు. ఇది కేంద్ర బడ్జెటా.? లేక బీహార్, ఏపీ బడ్జెటా.? అని చాలామంది అనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కిం ది గుండు సున్నానే అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కెసిఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశామన్నారు. రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించామని, కానీ దక్కింది మాత్రం శూన్యమని అసంతృప్తి వ్యక్తం చేశారు.

’రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్ద పీట వేశారు. తెలంగాణకు మరోసారి గుండు సున్నానే దక్కింది. ములుగు వర్శిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుకు ఎన్నిసార్లు జాతీయ హోదా అడిగినా పట్టించుకోలేదు.’ అంటూ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎపికి నిధుల వరద కురిపించి తెలంగాణా ముఖాన బురద కొట్టారన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదన్నారు. ఐఐఎం సహా నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

మెగా పవర్ లూమ్ క్లస్టర్ తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగిన కూడా కేంద్రం స్పందించలేదన్నారు. తెలంగాణ నుంచి ముంబై- నాగపూర్, బెంగళూరు- చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ అతీగతీ లేదన్నారు. తెలంగాణ సిఎం, మంత్రులు ఢిల్లీ వెళ్లి అడిగినా కేంద్రం పట్టించుకోలేదని, తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు 16 స్థానాలను ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాల న్నారు. 16 స్థానాలున్న ఎపి, 12 సీట్లున్న బీహార్‌కు కేంద్ర బడ్జెట్‌లో దక్కిన నిధులు చూసి ఆలోచించాలని, ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలి మరోసారి ఈ బడ్జెట్ తెలియజేస్తుందని చెప్పారు. బిజెపి, కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్‌లో మాట్లాడలేదని విమర్శించారు.

అయితే, కేంద్ర బడ్జెట్‌లో ఎపికి ఎక్కువ నిధులు కేటాయించినందుకు తమకు బాధ లేదని, సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపులు, వారు బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. ఎపి విభజన చట్టం పేరు చెప్పి తెలంగాణ డిమాండ్లు మాత్రం కేంద్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ’ఏపీ విభజనం చట్టం పేరు చెప్పి తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించు కోవడం లేదు. అమరావతి, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి నిధులు ఇస్తాం అన్నారు. ఎపి ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఎపి, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరం.’ అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News