- Advertisement -
హైదరాబాద్: అభివృద్ధి, ప్రభుత్వ భూమి అని సమర్థించుకుంటున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. పర్యావరణ పరిరక్షణ పేరిట పేదల ఇళ్లు కూల్చారని మండి పడ్డారు. తాజాగా హెచ్ సియూ ఉద్రిక్తత పరిణామాలపై కెటిఆర్ స్పందించారు. అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారని, జంతువుల ప్రాంతాలకు వెళ్లి సామూహిక హత్య చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?అని కెటిఆర్ ప్రశ్నించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులా? రియల్ ఎస్టేట్ ఏజెంట్లా? అని ధ్వజమెత్తారు. విధ్వంసం, ఖజానా నింపుకోవడమే కాంగ్రెస్ నాయకుల నినాదమా అని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -