సిరిసిల్ల: పేదల రక్తం పీల్చి పదేళ్లలో రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో పదేళ్లలో రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. సిరిసిల్లలో కెటిఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. అదానీ, అంబానీలకు రూ.14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని, కానీ రైతులకు మాత్రం చేయలేదని ధ్వజమెత్తారు. తాను చెప్పింది తప్పని బిజెపి నేతలు నిరూపిస్తే తన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కరీంనగర్ స్థానంలో పోటీ కాంగ్రెస్‌తో కాదు అని, బిఆర్‌ఎస్‌కు పది నుంచి 12 ఎంపి సీట్లు గెలిస్తే ఆరు నెలల్లో కెసిఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థితికి వస్తారని కెటిఆర్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ సెస్సుల రూపంలో కొత్త పనులు వసూలు చేశారని, రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని కొత్త పన్నులు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జాతీయ రహదారుల కోసం పన్నులు వేశారని సమర్ధించుకున్నారని, పెట్రోల్, డీజిల్‌పై పన్నులు వేస్తే హైవేలపై టోల్ ఛార్జీలు ఎందుకు అని ప్రశ్నించారు. హైవేలపై టోల్ వసూళ్లపై ప్రశ్నిస్తే బిజెపి వద్ద జవాబు లేదని కెటిఆర్ చురకలంటించారు.
అదానీ, అంబానీలకు రూ.14.5 లక్షల కోట్ల రుణమాఫీ: కెటిఆర్…
- Advertisement -
- Advertisement -
- Advertisement -