Monday, January 20, 2025

కేసీఆర్ గెలిస్తే కామారెడ్డి రూపురేఖలు మారిపోతాయి: కేటీఆర్

- Advertisement -
- Advertisement -

కేసీఆర్ గెలిస్తే కామారెడ్డి రూపురేఖలే మారిపోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డిలో శనివారం జరిగిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు రైతు బంధు వద్దంటున్నారని, ధరణి పథకాన్ని తీసేయాలంటున్నారని అన్నారు. ధరణిని తీసేసి, పాత పట్వారీ వ్యవస్థనే తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోందని విమర్శించారు. ధరణిలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుందామని, అంతే తప్ప ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టుకోం కదా అని కేటీఆర్ అన్నారు. 16వేల రూపాయల ఆర్థిక సాయం అందించే రైతు బంధు కావాలంటే బీఆర్ఎస్ కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణా మీద కేసీఆర్ కు ఉన్న ప్రేమ ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీకి ఎందుకుంటుందని ప్రశ్నించారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బీడీ కార్మికులకు కూడా తమ ప్రభుత్వం అండదండలు అందిస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News