Sunday, November 24, 2024

ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ తో రక్తమాంసాలు పీలుస్తలేరా?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నో ఎల్‌ఆర్‌ఎస్, నో టిఆర్‌ఎస్ చెప్పారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో కెటిఆర్ ప్రసంగించారు. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ డబ్బులు వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. ఎల్‌ఆర్‌ఎస్ రూపంలో ప్రజల నుంచి కాంగ్రెస్ రూ.20 వేల కోట్లు రాబట్టాలని చూస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా భూములు క్రమబద్దీకరిస్తామని చెప్పారని, ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని గతంలో భట్టి విక్రమార్క చెప్పిన విషయాన్ని గర్తు చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు కట్టమంటే రక్తమాంసాలు పీలుస్తున్నారని గతంలో భట్టి అనలేదా?, గతంలో ఆయన చెప్పిన మాటలు ఒట్టి మాటలేనని అర్థమయ్యిందని కెటిఆర్ చురకలంటించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రక్తమాంసాలు పీలుస్తాలేదా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా భూములు క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారని ఏమైందని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News