Wednesday, December 25, 2024

అప్పులే కాదు ఆస్తుల గురించి కూడా చెప్పాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రమే నంబర్‌వన్ స్థానంలో ఉందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కెటిఆర్ తెలిపారు.  దేశ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణ ముందువరుసలో ఉందని, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తలసరి ఆదాయంలో పోటీపడుతున్నామన్నారు. 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.369 కోట్ల మిగులుతో మాకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగించిందని పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసన సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. 2022-23 రెవెన్యూ మిగులు రూ.5944 కోట్లు ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు రూ.209 కోట్లు చూపించడం ఏంటని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.5944 కోట్ల రెవెన్యూ మిగులుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అప్పగించామని స్పష్టం చేశారు.

కెసిఆర్ పాలనలో అప్పులు, రెవెన్యూ బిల్లులకు లోబడి ఉన్నాయని, తాము చేసిన నికర అప్పు రూ.3,85,340 కోట్లు మాత్రమే ఉందని వివరించారు. సంపదను చూస్తేనే అప్పులు ఇస్తారని, జిఎస్‌డిపిలో మన రాష్ట్ర మంచి స్థానంలో ఉందన్నారు. రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ.14.65 లక్షల కోట్లకు ఆదాయం పెంచామని కెటిఆర్ ప్రశంసించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు చెప్పినవాళ్లు, తాము ఇచ్చిన ఆస్తుల గురించి కూడా చెప్పాలని నిలదీశారు. జీతాలు ఇచ్చేందుకు అప్పులు తీసుకొస్తున్నామని, బడ్జెట్‌లో మాత్రం రెవెన్యూ మిగులు ఉందని ఆర్థిక మంత్రి చెప్పారని, మంత్రుల సభలో చెప్పిన మాటలు తప్పా?, బడ్జెట్‌లో ఉన్న లెక్కలు తప్పా అని కెటిఆర్ అడిగారు

రెవెన్యూ మిగులుతో అప్పగిస్తే అప్పులకుప్పగా మార్చారని కాంగ్రెస్ విమర్శలు చేయడం సరికాదన్నారు. కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, కరోనాకు ముందు బిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా జీతాలు సక్రమంగానే ఇచ్చిందని, రైతుబంధు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, ఆగవద్దని అనుకున్నామని, ఎస్‌సి, ఎస్‌టిలకు ఇచ్చే సాయం ఆపకూడదని నిధులు మళ్లించ్చామని వివరించారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టు, మెడికల్ ఆఫీసర్లకు పది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని కెటిఆర్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News