Saturday, November 16, 2024

వాళ్లకు సాయం చేయడం చేతకాదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR fire on Modi government

హైదరాబాద్: ఆరున్నర ఏళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సికింద్రాబాద్‌లో టిఆర్‌ఎస్ గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాఫ్ వెల్పేర్ అసోసియేషన్ సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. కరోనా వైరస్‌తో రూ.52 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. ప్రైవేట్ విద్యారంగంలో పది నుంచి పన్నెండు లక్షల మంది ఉన్నారని, వాళ్లందరికి సంతృప్తికరంగా సాయం చేయడం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదన్నారు.

కాంగ్రెస్, బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా సాయం చేయలేదని, తెలంగాణలో కోటి ఎకరాలకు పైగా సాగు చేసే స్థాయికి ఎదిగామన్నారు. సిఎం కెసిఆర్ సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం వల్లనే అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయని, తెలంగాణక కేంద్రం ఒక్క కొత్త విద్యా సంస్థలను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటే ఇదేనా అని మోడీ ప్రభుత్వాన్ని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రతి జన్‌ధన్ ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నారని, రూపాయి కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రానికి తెలంగాణ 2.42 లక్షల పన్నుల కడితే… కేంద్రం తిరిగి ఇచ్చింది లక్ష కోట్లేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు తరువాత హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింతో గమనించాలన్నారు. తెలంగాణ ఏర్పడక ముందుకు అనేక అపోహలు సృష్టించారని, తెలంగాణ కంటే 13 ఏళ్లు ముందు ఏర్పడిన జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇంకా సెటిల్ కాలేదని, తెలంగాణ ఏర్పడక ముందు ప్రతి అపార్ట్‌మెంట్‌లో జనరేటర్ ఉండేదని, ఆరు నెలల్లోనే ఇరువై నాలుగు గంటల కరెంట్‌ ఇచ్చే స్థితికి ఎదిగామని, గురుకులాల్లో ఒక్కొక్క విద్యార్థిపై లక్ష25 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కె, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News