Friday, December 20, 2024

ప్రతిపక్షాలు టార్గెట్‌గా కేంద్ర ఎజెన్సీల దాడులు: కెటిఆర్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

KTR Fires BJP Over Raids by Central Agencies

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, అదే విధంగా ఎన్నికల సమయంలో మోడీ చెప్పినట్లుగా ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ప్రధానికి లేఖ రాసిన కెటిఆర్.. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా శనివారం బిజెపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై కేంద్ర ఏజెన్సీల దాడులు పెరుగుతున్నాయన్నారు. ఈ విధమైన ధోరణి ఎందుకు పెరుగుతున్నదని ప్రశ్నించారు. సత్య హరిశ్చంద్రతో సంబంధం ఉందా? అని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ బిజెపి నేతలను కూడా కెటిఆర్ దుయ్యబట్టారు. మంత్రి ట్విట్టర్‌లో బిజెపి నేతృత్వంలోని కేంద్రానికి సూటి ప్రశ్నలు సంధించారు. ‘గత 8 సంవత్సరాలలో బిజెపి నాయకులు లేదా వారి బంధువులపై ఎన్ని ఇడి, ఐటి, సిబిఐ దాడులు జరిగాయి?. క్యా సబ్ కే సబ్ బిజెపి వాలే సత్య హరిశ్చంద్ర కే రిష్ఠేదార్ హై? ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ట్వీట్ చేశారు.

KTR Fires BJP Over Raids by Central Agencies

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News