Wednesday, December 25, 2024

బిజెపికి పక్షవాతం

- Advertisement -
- Advertisement -

సిఎం లేఖ రాసినా ఖాతరు చేయని కేంద్రం ఈర్షతోనే మోడీ
కుయుక్తులు గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ సంస్థకు ఇచ్చినట్లే
తెలంగాణకు గనులు ఎందుకు కేటాయించరు? బొగ్గు గనుల వేలం
అంటే సింగరేణికి తాళం వేయడమే మరోసారి నల్ల నేల నుంచి
మహోద్యమం కేంద్ర మంత్రి జోషీ ప్రకటనపై భగ్గుమన్న కెటిఆర్

హైదరాబాద్: రాష్ట్రానికి ఆ యువు పట్టు అయిన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు ఆరోపించారు. తక్కువ కాలంలోనే దేశానికి ఆదర్శంగా ని లుస్తూ, అద్భుతమైన అభివృద్ధి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న తెలంగాణపై కక్ష కట్టి, ఢిల్లీ బిజెపి కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకునే ప్ర యత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. ఇందులో భా గంగానే ఎన్నో రోజుల నుంచి టిఆర్‌ఎస్ పార్టీ చెబుతున్నట్టుగానే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను మోడీ ప్రభు త్వం ముమ్మరం చేసిందని మండిపడ్డారు.

ఈ అంశంపై తాజాగా పార్లమెంటులో బొగ్గు గను ల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రాష్ట్రంలోని 4 సిం గరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు చేసిన ప్రకటనపైన కెటిఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి స్వయంగా ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటు కు వ్యతిరేకంగా అనేక సార్లు వ్యాఖ్యలు చేశారన్నారు. అన్ని రంగాలను దెబ్బతీసే ప్రయత్నా న్ని కేంద్రం కొనసాగిస్తోందని విమర్శించారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్రంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దొడ్డి దారిన
సిఎం కెటిఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సృష్టించిన అన్ని అడ్డంకులను దాటుకొని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణను దెబ్బతీసేందుకు దొడ్డి దారిన కేంద్రం కుట్రలు చేస్తుందని కెటిఆర్ ఆరోపించారు. అందులో భాగంగానే రాష్ట్ర కొంగు బంగారం, రాష్ట్ర అభివృద్ధికి ఆయువుపట్టు అయిన సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇదే కేం ద్ర ప్రభుత్వం
గుజరాత్ మినరల్ డెవలప్‌మెట్ కార్పొరేషన్‌కు నామినేషన్ పద్ధతిన గుజరాత్‌లో భారీగా లిగ్నైట్ గనులు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

గుజరాత్ మాదిరే తెలంగాణలోని సింగరేణికి సైతం బొగ్గు గనులను కేటాయించాలని అనేక రోజులుగా తమ ప్రభుత్వం కోరుతోందన్నారు. అయినప్పటికీ కేంద్రం పెడచెవిన పెడుతోందని విమర్శించారు. ఎప్పటి మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌కు ఒక న్యాయం…. తెలంగాణలోని సింగరేణి ఇంకొక న్యాయం అన్నట్లుగా పక్షపాతంతో వ్యవహరిస్తూ తీరని అన్యా యం చేస్తుందని విమర్శించారు. అందులో భాగంగానే గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ప్రభు త్వం అప్పజెప్పిన గనుల కేటాయింపు, వాటి పర్యావరణ అనుమతులు ప్రక్రియ తాలూకు పత్రాలను మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా విడుదల చేశారు.

ప్రధాని పీఠంపై కూర్చోగానే గుజరాత్‌పై పక్షపాతంతో 2014 ఆగస్టులోనే లిగ్నైట్ గనులను గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆ తరువాతి సంవత్సరం జూలై 27వ తేదీనే కేంద్రం, లిగ్నైట్ బొగ్గు గనులను గుజరాత్ సంస్థకి కేటాయించిందన్నారు. దాంతో పాటు గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించిన పర్యావరణ అనుమతులు తాలుకు 2018 పత్రాలను సైతం ఆయన విడుదల చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సింగరేణికి బొగ్గు పనులు కేటాయించాలని రాష్ట్ర ప్రజలతో పాటు సింగరేణి కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కేంద్రాన్ని కోరినా పెడచెవిన పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ అంటే మోడీకి ఈర్ష
తెలంగాణ అంటే మొదటి నుంచి మోడీకి జలసీ (ఈర్ష)తో వ్యవహరిస్తూన్నారని కెటిఆర్ మండిపడ్డారు. తెలంగాణ పట్ల ఈ పక్షపాతం ఇంకెన్ని రోజులు అంటూ ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ తెలంగాణకు వచ్చిన మోడీ రాష్ట్ర ప్రజలను నమ్మబలికించే ప్రయత్నం చేశారన్నారు. కానీ ఇప్పుడు సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను వేలానికి పెట్టడం వారి ద్వంద్వ ప్రమాణాలకు, బూటకపు మాటలకు అద్దం పడుతుందన్నారు.

కేవలం నష్టాల్లో ఉన్న కంపెనీలను అమ్ముతామంటూ కల్లబొల్లి మాటలు చెప్పే బిజెపి ప్రభుత్వం, గణనీయమైన ఉత్పత్తితో పాటు లాభాల్లో కొనసాగుతున్న వాటిని కూడా ప్రైవేటీకరణ చేయడం శోచనీయమన్నారు. పైగా ప్రతి సంవత్సరం కొత్త రికార్డులు సృష్టిస్తూ, తాజాగా దేశంలోనే అత్యధికంగా పిఎల్‌ఎఫ్ సాధించిన సింగరేణిని దెబ్బకొట్టే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తుందన్నారు.

కార్పొరేట్‌లకు అప్పజెప్పాలన్నదే కేంద్రం లక్షం
బొగ్గు తవ్వకమే సింగరేణికి ప్రధాన విధి అని కెటిఆర్ అన్నారు. అలాంటి సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా వేలం పాట పేరుతో సంస్థపై భారీగా ఆర్థిక భారం మోపే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇలా వేలంపాట ద్వారా బొగ్గు గనులను ప్రైవేటుకు అప్పజెప్పి, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించకుండా నష్టాల పాల్జేసి, అమ్మకానికి పెట్టినట్లుగానే సింగరేణిని కూడా అంతిమంగా తన కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పే కుట్రలను కేంద్రం చేస్తుందని మండిపడ్డారు.

సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని గత సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన సిఎం కెసిఆర్ ప్రధానికి ఒక లేఖ కూడా రాశారన్నారు. అయినా కేంద్రప్రభుత్వం కార్మికుల ఆందోళనలను, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను పట్టించుకోకుండా మొండిపట్టుతో ముందుకు పోతున్నది విమర్శించారు. సింగరేణి పరిధిలోని బొగ్గు గనులన్నింటిని ప్రవేట్ కి అప్పజెప్పితే మరి సింగరేణి కాలరీస్ సంస్థ చేయాల్సిన పని ఇంకేం మిగిలి ఉంటుందని కెటిఆర్ ప్రశ్నించారు.
గనులకు వేలమంటే సింగరేణికి తాళమే
బొగ్గు బావులకు వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమే కెటిఆర్ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ కేవలం సింగరేణి విస్తరించిన ఏడేనిమిది జిల్లాల సమస్య కాదన్నారు. ఇది సమస్త తెలంగాణ అంశమన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్ర అని కెటిఆర్ మండిపడ్డారు. బోర్ల నీటిపై ఆధారపడిన రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి, పంట భూములను పచ్చగా మారుస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కరెంటు కష్టాలు కల్పించి తెలంగాణ రైతన్నలకు అన్యాయం చేసేందుకు కేంద్రం కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు.

రాష్ట్ర థర్మల్ పవర్ జనరేషన్‌లో సింగరేణి పాత్ర అత్యంత కీలకమైనదన్నారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24 గంటల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సరఫరాను దెబ్బతీయాలన్న ఆలోచనతోనే కేంద్రం సింగరేణిపై కక్ష కట్టిందన్నారు.
ప్రైవేటీకరిస్తే రాష్ట్రం చీకట్లోకి జారుకుంటుంది
సింగరేణిని ప్రైవేటీకరిస్తే తెలంగాణ చీకట్లోకి జారుకుంటుందని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు, రాష్ట్రంలోని దళిత, గిరిజన, కులవృత్తులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ వంటి పథకాలపైన అక్కసుతోనే కేంద్రం ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉచితాలన్ని అనుచితాలే అంటూ స్వయంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటనల నేపథ్యంలోనే కేంద్రం బలవంతంగా ప్రజలకు ఉచిత విద్యుత్తును దూరం చేసేలా యత్నిస్తోందని విమర్శించారు. ఇందులో భాగంగానే నూతన విద్యుత్ సంస్కరణల కుట్రలకు కేంద్రం తెరలేపిందన్నారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం బలంగా అడ్డుకుంటున్నదన్నారు.

అందుకే పరోక్షంగా తెలంగాణను విద్యుత్ రంగంలో దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాల్లో కేంద్రం విజయం సాధిస్తే రాష్ట్రం చీకటిమయం కావడంతో పాటు సింగరేణి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారన్నారు. వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాలలో రిజర్వేషన్లు, వారికిచ్చే బోనసులు, అలవెన్స్‌లు ఇతర సంక్షేమ కార్యక్రమాలు రద్దు అవుతాయని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
దక్షిణ భారత్‌కు వెలుగునిస్తోంది
150 సంవత్సరాలకు పైగా తెలంగాణకు మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశానికి సింగరేణి వెలుగులు పంచుతోందన్నారు. అందువల్ల సూర్యుల బతుకులను చిదిమెసే కుట్రలు ఇకనైనా కేంద్రం ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ ద్వారా సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రధాని అర్థం చేసుకోవాలన్నారు.

ఇప్పటికే సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలపైన ఉద్యోగులు, కార్మికుల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారన్నారు. వారికి టిఆర్‌ఎస్ పార్టీ ప్రతిసారి అండగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా గనుల వేలం పైన ముందుకు వెళితే టిఆర్‌ఎస్ పార్టీ తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
మరోసారి ఉద్యమానికి సిద్దమవుతాం
మరోసారి కేంద్రానికి వ్యతిరేకంగా సింగరేణి గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి సిద్ధమవుతామని కెటిఆర్ స్పష్టం చేశారు. సింగరేణి మెడపై కేంద్రం ప్రవేట్ కత్తి పెడితే బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు వేటు వేయడం ఖాయమన్నారు. సింగరేణి భుజంపై నుంచి రాష్ట్రప్రజలపై గన్ను పెడుతు న్న కేంద్ర ప్రభుత్వం తీరుని ప్రజలు గమనిస్తున్నారన్నా రు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి పా ర్లమెంట్ సభ్యుడు కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలకు వ్యతిరేకంగా గొంతు ఎత్తాలన్నారు. రాష్ట్ర ప్రజల ప ట్ల తమ నిబద్ధతను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ విషయంపై టిఆర్‌ఎస్ ఎంపీలు బొగ్గు గనుల వే లం అంశంపై పార్లమెంటులో నిలదీస్తారన్నారు. ఆర్థిక సామాజిక జీవనాడిపై దెబ్బ కొట్టాలని చూస్తున్న కేంద్రం కుట్రలపై పోరాడేందుకు కలిసి రావాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి కెటిఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News