Tuesday, December 31, 2024

సిఎం రేవంత్ రెడ్డిపై కెటిఆర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జై తెలంగాణ అనలేని మూర్ఖుడు

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఒక్క రోజుకే పరిమితం చేసిన మూర్ఖుడు రేవంత్ రెడ్డి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో జెండాను ఎగరవేసిన కెటిఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ జాక్పాట్ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా జై తెలంగాణ అనలేని మూర్ఖుడన్నారు. కెటిఆర్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

25 సంవత్సరాలుగా కెసిఆర్ తో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్కరికి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.ఉద్యమంలో సహకరించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, యువకులు, సబ్బండ వర్గాల వారందరికీ హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News