Tuesday, December 24, 2024

నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు..అరెస్ట్ చేసుకో రేవంత్:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఏదో ఒక కేసులో నన్ను ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు అంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను అని వ్యాఖ్యానించారు. నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు… చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి అంటూ ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. ఎవనిదిరా కుట్ర..? ఏంది ఆ కుట్ర..?.. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా..? సిఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. నీ అల్లుని కోసమో, అన్న కోసమో, రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా..? ..గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా..?..నీ ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర..? …పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర..? ఎవని కోసం కుట్ర అని..? అని నిలదీశారు. మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర..?..50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది..?..చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో అంటూ ట్వీట్ చేశారు.

నీకు అన్నీ కుట్ర లాగానే కనిపిస్తాయి : 50 లక్షల రూపాయల లంచం డబ్బులతో దొరికిన నీకు అన్నీ కుట్ర లాగానే కనిపిస్తాయని కెటిఆర్ అన్నారు. మీ అల్లుడి కంపెనీ కోసం లాక్కుంటున్న భూములకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న పోరాటం కుట్రగానే కనిపిస్తుందని, మీ అన్న బెదిరింపులకు లొంగని రైతన్నల ధైర్యం కుట్రగానే కనిపిస్తుందని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇద్దరు వ్యక్తులు ఫోన్‌లో మాట్లాడుకున్న కుట్రలాగానే అనిపిస్తుంది..ప్రజలు సోషల్ మీడియాలో తమ బాధలు పోస్టు చేస్తే కుట్రగానే కనిపిస్తుంది..పేద గిరిజన రైతులకు అండగా నిలబడితే అది కుట్రగానే అనిపిస్తుంది..9 నెలలపాటు నీ అపాయింట్మెంట్ కోసం వేచి చూసి,

నీ బెదిరింపులన్ని తట్టుకొని, చివరికి ఎదిరిస్తే అది నీకు కుట్ర లాగానే అనిపిస్తుంది..పేద రైతన్నల కుటుంబాల మీద అర్ధరాత్రి దాడులు చేసి, అక్రమంగా అరెస్టు చేసి, వారిని చిత్రహింసలకు గురిచేసినప్పుడు నేను ప్రశ్నిస్తే కుట్రలాగానే అనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రతినిత్యం భయంతో బతికే నీకు ఇవన్నీ కుట్ర లాగానే అనిపిస్తాయని, ప్రతిక్షణం నువ్వు భయాన్ని శాసిస్తూ ఆ భయంలోనే బతుకుతున్నావు..గొంతులేని వారికి గొంతుకు అయినందుకు…పేద రైతన్నల పక్షాన నిలబడినందుకు అరెస్టు చేస్తానంటే చేసుకో..తెలంగాణ రైతన్నల పక్షాన నిలబడి, తలెత్తుకొని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తా..జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News