Wednesday, January 22, 2025

జనం కోసం జైలుకెళ్తా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నిర్మల్ ప్రతినిధి:ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికి సైతం వెనకాడని కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీ రామరక్షా అని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశా రు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి న కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఒక్క వ ర్గానికి కూడా న్యాయం చేయకుండా అసమర్ధ పాల న కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా కోసం అన్నదాతలకు అండగా తలపెట్టిన పోరుబాట కార్యక్రమంలో ఆయన ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ని రాంలీలా మైదానంలో నిర్వహించిన పోరుబాట సభలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నేతలు తీవ్రంగా ఖండించారు.

రాష్ట్రంలో అడుగడుగునా అశాంతి, అభద్రత నెలకొందని, డిచ్ పల్లిలో పొలిసు కుటుంబీకులు ధర్నాలు చేయడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న తమపై కేసులు పె డుతున్నారన్న ఆయన… ఎన్ని రోజులు జైల్లో ఉం డడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. అధికారులు, పొలీసు యంత్రాంగం న్యాయం కోసం పని చేయాలని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. మితిమీరి ప్రవర్తించిన వారికి తాము అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. పేదలకు నష్టం చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, పేదలని కూడా చూడకుండా కేసుల పేరిట బెదిరించడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. ఉద్యమాలు పురిటిగడ్డ లాంటి ఆదిలాబాద్ లో పోరుబాట కు శ్రీకారం పడిందని, ఇదే బాటలో నడుస్తూ రైతుల పక్షాన పోరాడతామని పేర్కొన్నారు.

ముక్రా గ్రామస్తులు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ కి పోస్టు కార్డులను పంపి ప్రశ్నించారని, పోస్ట్ కార్డు ఉద్యమాన్ని గ్రామగ్రామాన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో పండించే పత్తికి గుజరాత్ కంటే తక్కువ ధర చెల్లించడం భావ్యం కాదని, పత్తి ధరపై ఇక్కడి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. భారత రాష్ట్ర సమితి… భారత రైతు సమితిగా పోరాటాలు చేస్తుందని, రైతులెవరూ అధైర్య పడే అవసరం లేదని భరోసా కల్పించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న తన ప్రసంగంతో శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ లతో పట్టణ అధ్యక్షులు అజయ్, మైనార్టీ నాయకులు సజీతోద్దీన్, యూనిస్ అక్బాని, మహిళా నాయకులు చారులత, స్వరూప రాణి బుడగం మమత, ప్రేమల,పాటు ఉమ్మడి జిల్లా నేతలు, పలువురు రాష్ట నాయకులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News