Friday, November 22, 2024

చిట్టినాయుడు..నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రజలు మర్చిపోయేలా చేశానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిట్టి నాయుడు..నువ్వా కేసీఆర్ పేరును తుడిచేదని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్ర కేసీఆర్ అని, నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోశారని అన్నారు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసారని పేర్కొన్నారు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టారని గుర్తు చేశారు. నువ్వు సాధించుకున్న తెలంగాణను చంపేటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్‌కు ఊపిరి పోశారని అన్నారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఫినిష్ చేసిందే రేవంత్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఫినిష్ చేసిందే రేవంత్ రెడ్డి అని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ అన్నారు. బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఫ్యాక్షన్ భాష మాట్లాడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి భస్మాసురుడిలా మారాడని అన్నారు. చంద్రబాబుతో సహా టీడీపీలో చాలామంది సీనియర్ నాయకులను ఫినిష్ చేశారని, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీని ఫినిష్ చేశాడని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రే వాళ్లను ఫినిష్ చేస్తా, వీళ్లను ఫినిష్ చేస్తానని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేక వాదులు కూడా కెసిఆర్‌ను ఫినిష్ చేస్తానని అనలేదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంకా ఫ్యాక్షన్ బుద్ధులు పోలేదని దాసోజు శ్రవణ్ విమర్శించారు.

నా పంచాయతీ రేవంత్ రెడ్డితోనే
నా పంచాయతీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్‌తో కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని ఆరోపించారు. మేము కౌశిక్ రెడ్డిని ట్రాప్ చేయలేదని ఇంటిలిజెన్స్ చీఫ్‌ను ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని, మేము డబ్బా పట్టుకుని రెడీగా ఉన్నామని అన్నారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సవాల్ ను మేము స్వీకరించామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News