Thursday, November 14, 2024

రేవంత్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని తలపిస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్ ఆయన మీడియాతో మాట్లాడుతూ..” కేసీఆర్ ఎంతో ముందు చూపుతో ముచ్చర్లలో 8 ఏళ్లు కష్టపడి దాదాపు 14 వేల ఎకరాలను సేకరించి 50 ఏళ్ల పాటు ఎలాంటి సమస్య లేకుండా ఫార్మా సిటీకి ప్లాన్ చేశారు. అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు.. ఫార్మా సిటీ వస్తే మీ ప్రాంతం కాలుష్యం అవుతుందని ప్రజలను రెచ్చగొట్టారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ఫార్మా సిటీ పేరును ఫార్మా విలేజ్ గా మార్చారు. రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ కోసం భూములు ఇవ్వకపోతే రైతులపై దౌర్జన్యం చేస్తారా?. రేవంత్ ఆదేశాలతో కొడంగల్ రైతులను పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. రిమాండ్‌కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయారు. వెంటనే రైతులకు మెడికో లీగల్ పరీక్షలు చేయాలి. ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రైవేట్ డాక్టర్లతో పరీక్షలు నిర్వహించాలని మేజిస్ట్రేట్ ను కోరుతున్నాం” అని కెటిఆర్ పేర్కొన్నారు.

కాగా, ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్, అధికారులపై లగచర్లలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News