Friday, December 20, 2024

రేవంత్‌కు కమలదళం రక్షణ కవచం

- Advertisement -
- Advertisement -

దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం కిషన్‌రెడ్డికి మూసీ బాధితుల
ఆక్రందనలు ఇప్పుడు గుర్తొచ్చాయా? లగచర్ల ఘటన నుంచి దృష్టి
మళ్ల్లించేందుకే మూసీ నిద్ర కార్యక్రమాలు : కెటిఆర్ ధ్వజం

మన తెలంగాణ/హైదరాబాద్ : రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం మారిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. దోస్తును కాపాడేందుకు ‘చీకటి’ రాజకీయం..వారెవా తోడు దొంగల నాటకం అంటూ ట్వీట్ చేశారు.లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని దుయ్యబటా రు. హైడ్రాను మొదట స్వాగతించిన మీకు ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా..? అని ప్ర శ్నించా రు. బుల్డోజర్‌లను అడ్డుకుంటామన్నది మేము అని పేర్కొన్నారు.

రేవంత్‌ను మొదట అభినందించింది మీరైతే..మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేము అని బిజెపి నేతలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి..?..ఎవరిని కాపాడటం కో సం..? ఎవరిని ముంచడం కోసం..? ..మరెవరిని వంచించడం కోసం..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్‌ను కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు… లగచర్ల రైతులకు తెలంగాణ బిజెపి పంగానామాలు అని పేర్కొన్నా రు. మీ పాలి‘ట్రిక్స్’ను గమనిస్తోంది తెలంగాణ..ఆట కట్టిస్తుంది సరైన వేళ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News