Monday, January 20, 2025

రసీదులున్నాయి.. అవినీతి ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

తప్పు చేయలేదు..భయపడేది లేదు
ఏమైనా చేసుకోండి దమ్ముంటే అసెంబ్లీలో
చర్చకు పెట్టండి అబద్ధాలు చెప్పి
గవర్నర్‌ను ఒప్పించారేమో తెలియదు
కరప్షనే లేనప్పుడు..యాంటీ కరప్షన్ కేసు
ఎలా పెట్టారు? సిఎం రేవంత్‌పై కెటిఆర్ ఫైర్
నేడు హైకోర్టులో కెటిఆర్ క్వాష్ పిటిషన్

హెచ్‌ఎండిఎ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్ రెడ్డిపై కేసు నమోదు
ప్రభుత్వం విచారణలో బయటపడ్డ అవకతవకలు..
ప్రభుత్వ నిధులు రూ. 54,88,87,043 అక్రమ బదిలీలు..
యూకెకు చెందిన ఎఫ్‌ఇఒ ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ కంపెనీకి చెల్లింపు
రెండు విడతల్లో చెల్లింపు.. మొదట 2023 అక్టోబర్ 3న రూ. 22,69, 63,125 చెల్లింపు..
రెండవ విడత 2023 అక్టోబర్ 11న రూ. 23,01,97,500 బదిలీ..
హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి బదిలీ
విదేశీ కంపెనీకి చెల్లింపులతో హెచ్‌ఎండిఎకు అదనపు పన్ను భారం
రూ.8,06,75,404 అదనపు పన్ను భారం…
రూ. 10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి
సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్‌కు స్పాన్సర్స్ లేకపోవడంతో హెచ్‌ఎండిఎ నిధులు మళ్లించారు..

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను ఎలక్ట్రిక్ వాహనాలకు హబ్‌గా మార్చాలనే లక్ష్యంతోనే హైదరాబాద్‌లో ఫార్ములా -ఈ కార్ రేస్ నిర్వహించామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకురావాలని, భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అవుతుందన్న ఉద్దేశంతో ఫార్ములా- ఈ కార్ రేస్ పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. హైదరాబాద్‌ను ఇన్నోవేషన్, రీసెర్చ్, మానుఫ్యాక్షరింగ్ హబ్ ఉద్దేశంతో తాము ఈ కార్ రేసు నిర్వహించామని తెలిపారు. తాము ఫార్ములా 1 తో సంప్రదిస్తే తొలుత రామన్నారని, ఎన్నో తంటాలు పడి వారిని ఒప్పించామని చెప్పారు. ఎఫ్‌ఎంఎస్‌సిఐ, ఎఫ్‌ఐఎ అనే రెండు సంస్థలు ఈ రేసులు నిర్వహిస్తాయని కెటిఆర్ అన్నారు. రేస్ అనేది నాలుగు సంవత్సరాలు జరుగుతుందని, ఎఫ్-1 రేస్‌పై నగరాల అభివృద్ధి ఆధారపడి ఉందని వెల్లడించారు.

రేసింగ్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రాకతో మరింత పాపులారిటీ వచ్చిందని చెప్పారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు 2001లో శామీర్‌పేట దగ్గర జీనోమ్ వ్యాలీ పెట్టారని, ఈరోజు అది ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ల ఉత్పత్తికి కేంద్రంగా మారిందని వ్యాఖ్యానించారు. ఫార్ములా -ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎసిబి కెటిఆర్‌పై కేసు నమోదు చేసిన నేపథ్యంలో గురువారం రాత్రి తెలంగాణ భవన్‌లో మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేంద్‌రెడ్డి, పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ఈ- కార్ రేసు జరపాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయని, 2001 లోనే చంద్రబాబు ఫార్ములా-1 రేస్ పెట్టాలని ప్రయత్నించారని అన్నారు. దురదృష్టవశాత్తూ చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదని పేర్కొన్నారు.

రూ.150 కోట్లు ఖర్చు అయితే..రూ.700 కోట్ల ఆదాయం వచ్చింది
ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వం కలిపి ఈ రేస్ కోసం పెట్టిన ఖర్చు రూ.150 కోట్లు అయితే… దాదాపు రూ.700 కోట్ల ఆదాయం వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులకు రూ. 55 కోట్లు చెల్లించింది వాస్త వం అని కెటిఆర్ స్పష్టం చేశారు. లైసెన్స్ ఫీజు రూ. 74 లక్షలు వాపస్ పంపుతూ ఎఫ్‌ఎంఎస్‌ఏ వాళ్లు లేఖ రాశారని అన్నారు. ఇందులో అవినీతి జరిగిందెక్కడో చెప్పాల ని డిమాండ్ చేశారు. 25 అక్టోబర్ 2022న నాలుగు సీజన్ల కోసం సంతకాలు చేశామని చెప్పారు. ఇది హైదరాబాద్ ఈవెంట్ కాదు.. ఇది ఇండియా ఈవెంట్ అని పేర్కొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫార్ములా ఈ వాళ్లతో పాటు గ్రీన్ కో అనే ప్రమోటర్ కంపెనీతో కలిపి భాగస్వాములను చేశామని చెప్పారు. ఫిబ్రవరి 10, 2023లో రేసింగ్ నిర్వహించామని తెలిపారు. ఆ వారం రోజుల పాటు మొబిలిటీ వీక్ అమలు చేశామని, హ్యుందాయ్, అమర్ రాజా కంపెనీ వంటి ఎలక్ట్రిక్ కంపెనీలు పెట్టుబడులతో వచ్చాయని వివరించారు. హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్‌కు హెచ్‌ఎండిఎ రూ. 35 కోట్లు ఖర్చు చేసిందని,గ్రీన్ కో ప్రైవేట్ కంపెనీ ప్రమోటర్ రూ. 110 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు.

ఈ రేస్ వల్ల హైదరాబాద్‌కు 82 మిలియన్ డాలర్ల ఎకనామిక్ బెనిఫిట్ వచ్చిందని నెల్సన్ అనే సంస్థ అధ్యయనం చేసి రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. అయితే ప్రమోటర్‌గా వ్యవహరించిన గ్రీన్ కో కంపెనీ వాళ్లు తమకు లాభం రాలేదని, రేసు నిర్వహణ నుంచి తప్పుకుని, వచ్చే ఏడాది చేయలేమని చెప్పారని గుర్తు చేశారు. 2023లో ఎన్నికలు, ఇతర కార్యక్రమంలో కారణంగా జూన్ నాటికి సెక్రటరి అరవింద్ కుమార్ వచ్చి.. నాలుగేళ్ల అగ్రిమెంట్ ఉందని అడిగారని, ఈవీలకు తెలంగాణ హబ్ కావాలంటే.. ఎలన్ మస్క్ లాంటి వ్యక్తిని పట్టుకొచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించాలనేది తమ ప్రయత్నం అని పేర్కొన్నారు. 3 ఆగస్టు 2023న ఫార్ములా ఈ నుంచి ఈమెయిల్ వచ్చిందని, హెచ్‌ఎండీఏ నుంచి 55 కోట్లు కడుదామని చెప్పానని అన్నారు. రేస్ పోనివొద్దని.. ప్రమోటర్‌ను వెతుకుదామని చెప్పానని పేర్కొన్నారు. 2023లో అక్టోబర్ 5,అక్టోబర్ 11 తేదీలలో అరవింద్ కుమార్ రెండు దఫాలుగా డబ్బులు పంపించారని చెప్పారు. అక్టోబర్ 19న హైదరాబాద్‌ను కాలేండర్‌లో చేర్చుతూ ఫార్ములా ఈ రేస్ వారు నిర్ధారించారని, ఆ డబ్బులు కట్టడం వల్ల రేస్ మిగిలిందని వివరించారు.

డబ్బులు కట్టకపోతే రేస్ పోయేదని, అభాసు పాలయ్యే వాళ్లం అని పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి జరుగుతుంటాయని, ఇది మొదటిసారి కాదు.. ఇదే చివరిది కాదని వ్యాఖ్యానించారు. ఈ రేస్‌కు ఖర్చు మొత్తం హెచ్‌ఎండిఎ పెట్టిందని, హైదరాబాద్‌లో జరిగే ఏ కార్యక్రమం అయినా హెచ్‌ఎండిఎ దగ్గరుండి చూసుకుంటుందని తెలిపారు. ఫార్ములా -ఈ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా కలిశారని అన్నారు. రేస్ నిర్వహణ పట్ల రేవంత్ పాజిటివ్‌గా స్పందించారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెట్టిందని మండిపడ్డారు. అంతేకాదు.. ఆ మీటింగ్‌లో దాన కిషోర్ కూడా ఉన్నారని అన్నారు. వచ్చే మూడేళ్లు కూడా హైదరాబాద్‌లో రేస్ నిర్వహిస్తామని ఫార్ములా -ఈ చీఫ్ ప్రభుత్వానికి చెప్పారని పేర్కొన్నారు. తర్వాత డబ్బులు కట్టలేదన్నారు. బట్టకాల్చి మీదేసే ప్రయత్నంలో భాగంగానే తనపై ఎసిబి కేసు పెట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి..ఏం చేసుకుంటావో చేసుకో..నా వెంట్రుక కూడా పీకలేవు అని అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, అందుకే తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో చర్చ పెట్టాలని తాను స్పీకర్‌ను, సిఎం రేవంత్‌రెడ్డిని కోరానని కెటిఆర్ పేర్కొన్నారు.

నలుగురు వ్యక్తుల మధ్యన కాదు..నాలుగు కోట్ల ప్రజల మధ్య ఈ అంశంపై చర్చ పెట్టాలని కోరానని తెలిపారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టే దమ్ము సిఎంకు లేదని చెప్పారు. సిఎం రేవంత్‌రెడ్డి ఎన్ని డైవర్షన్ గేమ్‌లు అడినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. లగచర్ల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కెటిఆర్ కొనియాడారు. లగచర్ల రైతుల కోసం పట్నం నరేందర్ రెడ్డి విరోచితంగా పోరాటం చేశారని అన్నారు.
సిఎం రేవంత్‌రెడ్డి మగాడైతే ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లు రద్దు చేయాలని కెటిఆర్ సవాల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News