Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌పై పోరుకు ‘హామీలే’ అస్త్రాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలతోనే ఎండగట్టాలని బిఆర్‌ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ కెటిఆర్ దిశానిర్దేశం చేశా రు. ప్రజలను వంచించాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కా లేదని, అసలు సినిమా ముందుందని వ్యా ఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బుధవా రం జరిగిన వరంగల్ లోక్‌సభ సన్నాహక సమావేశానికి మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మం త్రులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు,సత్యవతి రాథోడ్, పలువురు మాజీ ఎంఎల్‌ఎలు, బిఆర్‌ఎస్ నాయకులు పొన్నా ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి కెటిఆర్ ప్రసంగించా రు. విధ్వంసమైన తెలంగాణను పదేళ్లలో కె సిఆర్ వికాసం వైపు మళ్లించారని, గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కెసిఆర్ కష్టపడినంతగా దే శంలో ఎవరూ కష్టపడలేదని వివరించారు.

తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్న తపనతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారని తెలిపారు. పరిపాలనపై పూర్తి దృష్టి కేంద్రీకరించి పార్టీకి కొంత సమయాన్ని తక్కువ కేటాయించారని చెప్పా రు. పార్టీ సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళతామని అన్నారు. ఉద్యమా ల వీరగడ్డ  వరంగల్ జిల్లాలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే బిఆర్‌ఎస్ నేతలు ఓడిపోయారని, జయశంకర్ సార్ పుట్టిన నేలలో 2014, 2019లో వరంగల్ ఎంపి సీటును బిఆర్‌ఎస్ గెలుచుకుందని కెటిఆర్ పేర్కొన్నారు. ఈసారి కూడా వరంగల్‌లో గులాబీ జెండా ఎగరాలని కోరారు. సన్నాహక సమావేశాల్లో పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు వస్తున్నాయని, పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుంటామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి, పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టి విజయం దిశగా పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కార్యకర్తల్లో ఉత్సాహం యథావిధిగా ఉందని, ఇదే చైతన్యంతో పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా పని చేయాలని అన్నారు. ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదనే విషయం గుర్తుంచుకుని ముందుకు పోదామని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని, 420 హామీలు అని…ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలని కెటిఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇద్దామనుకున్నామని, కానీ గవర్నర్ ప్రసంగం, శ్వేత పత్రాలతో బిఆర్‌ఎస్, కెసిఆర్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు బిఆర్‌ఎస్‌పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అనవసరంగా నిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని భట్టి అబద్ధమాడారు
కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటి పైన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా అబద్ధమాడారని కెటిఆర్ పేర్కొన్నారు. జిల్లాలను రద్దు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైందని, కేంద్ర ప్రభుత్వ విధానాలు పేద ప్రజలను నష్టపరిచాయని, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కెటిఆర్ నేతలకు తెలిపారు.

కేసులకు భయపడేది లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిఆర్‌ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని కెటిఆర్ మండిపడ్డారు. కేసులకు భయపడేది లేదు అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్‌కు పటిష్టమైన లీగల్ సెల్ ఉందని, తప్పుడు కేసుల భాదితులకు పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని తెలిపారు. తప్పుడు కేసులను ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు సీరియస్‌గా తీసుకుని పోరాడాలని దిశానిర్ధేశం చేశారు. ఒక బిఆర్‌ఎస్ ఎంపిపిపై కేసు పెడితే మిగతా బిఆర్‌ఎస్ ఎంపిపిలందరూ స్పందించాలని కోరారు. పార్టీ నాయకులు ఎక్కడికక్కడ సమష్టిగా తప్పుడు కేసులపై స్పందించాలని అన్నారు. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం స్పందిస్తుందని చెప్పారు.

బిఆర్‌ఎస్‌ను లేకుండా చేయడం ఎవరి వల్ల కాదు
బిఆర్‌ఎస్‌ను ఉఫ్‌మని ఊదేస్తామని కొందరు అంటున్నారని, బిఆర్‌ఎస్‌ను లేకుండా చేయడం ఎవరి వల్ల కాదని కెటిఆర్ అన్నారు.23 ఏండ్లుగా బిఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారని పేర్కొన్నారు. కెసిఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నంత వరకు బిఆర్‌ఎస్ ఉంటుందని తెలిపారు. బిఆర్‌ఎస్ తెలంగాణ గొంతుక అని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్‌లో ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యు వరకు అందరూ ఉన్నారని, పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు త్వరలోనే శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పార్టీ కేడర్‌కు తెలంగాణ భవన్‌లో తనతో పాటు సీనియర్ నాయకులు అందుబాటులో ఉంటారని, తెలంగాణ భవనే ఇక మా అడ్డా అని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News