Sunday, January 19, 2025

తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాబందులా వ్యవహరిస్తున్నారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కష్టపడి సంపాదించుకున్న తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాబందులా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. శుక్రవారం సంగారెడ్డి సెంట్రల్‌ జైలులో వికారాబాద్ కలెక్టర్ పై  చేసిన నిందితులతో కెటిఆర్ ములాఖత్‌ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో రేవంత్‌రెడ్డి ఫార్మా కంపెనీలను విమర్శించారని.. ఇప్పుడు వేల ఎకరాలు కావాలంటున్నారని దుయ్యబట్టారు.

కులగణనలో పాల్గొన్న వ్యక్తితోపాటు వేరే చోట ఐటీఐ చదువుకున్న విద్యార్థిని కూడా అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్నారన్నారు. సిఎం అన్న తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని..ఆయన ఫోన్‌లో ఆదేశిలిస్తే.. అధికారులు పాటిస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News