అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా..? అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన నా తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా అని పేర్కొన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలి కేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కెసిఆర్ పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపామని తెలిపారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నమో రామచంద్రా అని ఆకలికేకలా..? అని మండిపడ్డారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకుని ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు .. నేడు గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదించడమా..సిగ్గు సిగ్గు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పాలకుల పాపం..విద్యార్థులకు శాపం..
జాగో తెలంగాణ జాగో అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.
అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా..?:కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -