Monday, January 27, 2025

సంఘర్షణ మన రైతులకు కొత్త కాదు..మోసం ఈ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సంఘర్షణ మన రైతులకు కొత్త కాదు..మోసం ఈ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దగా పడ్డ వ్యవసాయ రంగాన్ని పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో, కెసిఆర్ సారథ్యంలో రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, సాగునీళ్లు, ఉచితంగా 24 గంటల కరంట్, వంద శాతం పంటల కొనుగోళ్లతో ఆత్మస్థైర్యం నింపి అన్నదాతకు వెన్నెముకగా నిలిస్తే ఏడాది

కాంగ్రెస్ పాలనలో మళ్లీ తిరోగమనం మొదలయిందని పేర్కొన్నారు. అన్నదాతలారా ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. నాగలి ఎప్పుడూ ఒంటరి కాదు..నాగలి ఈ దేశపు భవిష్యత్తు అని తెలిపారు. జోడెద్దుల మాదిరిగా బిఆర్‌ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని రైతులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లా హత్నూర్,వర్తమన్నూర్ గ్రామ రైతు నర్సయ్య రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News