- Advertisement -
కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఏడాది క్రితం చెప్పింది.. ఇవాళ అక్షరాలా నిజమైందని చెప్పారు. తెలంగాణలో జిఎస్‌టి రాబడులు తగ్గడంపై కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అసమర్థ సిఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారని, దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారని మండిపడ్డారు. గతేడాది 10 శాతం నమోదైన జిఎస్‌టి వసూళ్లు కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థిక రంగంలో ఈ విధ్వంసం అని, మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం అని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే..రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరం అని పేర్కొన్నారు. కెసిఆర్ పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి..
- Advertisement -