Sunday, December 22, 2024

ఎన్నికలంటే కాంగ్రెసోళ్లకు ఎటిఎం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను రేవంత్ రెడ్డి తన కు డబ్బులు సంపాదించే ఎటిఎంగా వాడుతున్నారని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు ఆరోపించారు. ఓటు కు నోటు అంటూ కెమెరాలకు అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు… నోటుకు సీ టు…రేటెంత రెడ్డి అంటూ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫేక్ సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా తప్పుడు ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని, గతంలో కూడా ఇలాంటి సర్వేలతో పిచ్చి ప్రయత్నాలు చేసి చిత్తుగా ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కి ఉన్నదని విమర్శించారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బిల్యా నాయక్, ఆయన అనుచరులు బుధవారం తెలంగాణ భవన్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి, దేవరకొండ ఎంఎల్‌ఎ ర వీంద్ర నాయక్ ఆధ్వర్యంలో కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

వారికి గులాబీ కండువా కప్పి కెటిఆర్ సాదరంగా పా ర్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కెసిఆర్‌తో మాత్రమే గిరిజనులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నానని బిల్యా నాయ క్ చెప్పారని కెటిఆర్ తెలిపారు. దశాబ్దాలు కొట్లాడితే పరిష్కారం కాని సమస్యలు తమ ప్రభుత్వం అడగక ముందే పరిష్కరించిందని అ న్నారని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం ద్వారా 30 వేల మంది గిరిజన బిడ్డలు.. వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్‌ల వరకు ప్రజాప్రతినిధులుగా ఎదిగారని తెలిపారు. ఇది తమకు ఒక కానుక అని బిల్యా నాయక్ తెలిపినట్లు కెటిఆర్ పేర్కొన్నారు. ఫ్లోరోసిస్‌ను రూపుమాపిన నాయకుడు కెసిఆర్ మాత్రమే అని చెప్పారు. అన్నింటికి మించి
గిరిజన జాతికి రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. తండాలకు త్రీ ఫేజ్ కరెంట్ వస్తుందని బిల్యా చెప్పారని పేర్కొన్నారు.

విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన మొనగాడు కెసిఆర్ అని ఆయన చెప్పారని, ఇన్ని కారణాల వల్ల తాను బిఆర్‌ఎస్‌లోకి వస్తున్నానని చెప్పారని పేర్కొన్నారు. రాజకీయం కూడా చూసుకోవాలని కాకపోతే ఇన్ని కారణాలు వల్ల తాను బిఆర్‌ఎస్‌లో చేరినట్లు బిల్యా నాయక్ చెప్పారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. రవీంద్ర నాయక్, బిల్యా నాయక్ మంచి మిత్రులమని చెప్పారని తెలిపారు. ఎన్నికలప్పుడే తిట్టుకుంటాం తర్వాత మంచిగానే ఉంటామని చెప్పారన్నారు. భవిష్యత్తులో కూడా కలిసే ఉంటామని అన్నారని, ఇద్దరు నాయకులు కలిసిన తర్వాత.. దేవరకొండ నియోజకవర్గంలో 60 వేల మెజార్టీ రావాలని కెటిఆర్ అన్నారు.
ఊదరగొట్టే ఉపన్యాసాలు కాంగ్రెస్‌కు అలవాటే
ఎన్నికలు వచ్చినప్పుడల్లా గమ్మత్తయిన డైలాగులు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని మంత్రి కెటిఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. కొత్త అంగిలాగు కుట్టించుకుంటారు.. ఇండ్లకు సున్నాలు వేసుకుంటారని కెటిఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రి తానంటే తాను అని పోటీ పడుతారని ఎద్దేవా చేశారు. మీడియాలో కూడా సర్వే వస్తది.. అంతా అయిపోయిందంటారని విమర్శించారు. గమ్మతైన డైలాగులు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తారని… 2018లో అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కెసిఆర్‌ను ఓడించే దాకా గడ్డమే తీయను అని స్టేట్‌మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. మరి ఉత్తమన్న గడ్డం ఉందో పీకిందో తెలియదు గానీ, ఇలాంటి డైలాగులు మస్తుగా విన్నామని చెప్పారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా కొడంగల్‌లో ఆయనను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని డైలాగులు కొట్టిండని, కానీ ఇప్పుడు ఆ సన్నాసి మళ్లా పోటీ చేస్తుండని విమర్శించారు. ఇలా బేకర్ డైలాగులు కొడుతారని, ఐదారేండ్ల కింద ఓటుకు నోటు.. ఇప్పుడేమో సీటుకు నోటు.. అందుకే రేవంత్ రెడ్డిని ఇప్పుడు రేటంత రెడ్డి అని అంటున్నారని, వాళ్లతోటి ఏం కాదని కెటిఆర్ నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయ్యాలో చెప్పాలి
కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయ్యాలో చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నేతల ఎదిగారు కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నా కరెంటు ఇయ్యలేని సన్నాసులమని కాంగ్రెస్ ఓటు అడుగుతుందా..? అని ప్రశ్నించారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నా తాగునీటి ఇబ్బందులు తీర్చలేని చేతగాని వాళ్ళమంటూ ఓటు అడుగుతారా..? అంటూ నిలదీశారు. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలనే ఆలోచన మాకు రాలేదు అని ఓటు అడుగుతారా..? అని అడిగారు.

కాంగ్రెస్‌కు ఓటేసి మన వేలుతో మన కండ్లను పొడుచుకోవద్దు
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన వేలుతో మన కండ్లని పొడుచుకోవద్దని కెటిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ జమానాలో ఉన్న కరెంటు కోతలు వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు, తాగునీటి కొరత వంటి దుర్భర పరిస్థితులు మళ్లీ కావాలా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అన్న మూడు గంటల కరెంట్ కావాలా..? లేక 24 గంటల ఉచిత విద్యుత్తు కావాలా తెలంగాణ రైతులు అలోచించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం దాదాపు అన్ని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించిందని చెప్పారు. ఒకవైపు స్కీములు తెచ్చిన బిఆర్‌ఎస్ ఉన్నది… మరోవైపు స్కాములు తెచ్చిన కాంగ్రెస్ ఉన్నది….ఒకవైపు కారు ఉన్నది… మరొకవైపు బేకార్ గాల్లు ఉన్నారు…ఎవరికి ఒటెయ్యాలో ప్రజలు అలోచించాలని కోరారు. కెసిఆర్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచారని పేర్కొన్నారు. కెసిఆర్ మరోసారి తిరిగి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు మరింత అభివృద్ధి చెందుతారన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తున్నదని తెలిపారు.

ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత కనింపించలేదు
గత 15 రోజుల నుంచి 32 నియోజకవర్గాలకు వరకు తిరిగానని, ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనింపించలేదని కెటిఆర్ పేర్కొన్నారు.ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడకపోగా, కెసిఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాలు బాగుంటారని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి వనపర్తి దాకా, సత్తుపల్లి నుంచి మెదక్ వరకు.. తెలంగాణలోని నాలుగు మూలాలను తిరిగానని, ప్రజల మూడ్ స్పష్టంగా కనబడుతోందని చెప్పారు. ప్రజల నుంచి అసహనం వ్యక్తం కావడం లేదని అన్నారు. ఒక్క దేవరకొండలోనే రూ.600 కోట్లతో ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తిచేసి రానున్న ప్రభుత్వంలో దేవరకొండ ప్రజలకు సాగునీరు అందించి వారి రుణం తీర్చుకుంటామని తెలిపారు.

60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ నల్గొండను పట్టించుకోలేదని, ఈరోజు మిషన్ భగీరథ ద్వారా హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో ప్రజలకు అందుతున్న నాణ్యమైన తాగునీరే దేవరకొండలోని తండాలోని గిరిజనులకు కూడా అందుతున్నదని అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ 6 నుంచి 10 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తండాలను గ్రామపంచాయతీలు చేసి వేలాది మంది గిరిజనులకు రాజకీయ అవకాశాలు, స్వపరిపాలన అధికారం అందించామని తెలిపారు. నల్గొండ జిల్లా నుంచి ఫ్లోరోసిస్‌ని తరిమి, సాగునీటి జలాలు అందించి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి అద్భుతమైన మందిరాన్ని పునర్ నిర్మించిన కెసిఆర్‌కు ఓటేయాలా లేదా నల్గొండకి తరతరాలుగా అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు ఓటేయాలో ప్రజలు ఆలోచించాలని కోరారు.

బిజెపి ఎన్నికల హంగామా స్టార్ట్ చేసింది
తొమ్మిది సంవత్సరాల నిద్రపోయి గిరిజన యూనివర్సిటీ అంటూ బిజెపి ఎన్నికల హంగామా స్టార్ట్ చేసిందని కెటిఆర్ ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంట్‌లో చెప్పిన సమాచారాన్ని కాదని కేంద్ర మంత్రి అమిత్ షా అబద్ధాలు ఆడారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు మాట్లాడినందుకు అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవరకొండ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ అభ్యర్థి, ప్రస్తుత ఎంఎల్‌ఎ రవీంద్ర కుమార్, బిల్యా నాయక్‌లు కలిసిన తర్వాత అక్కడ ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంత కావడం ఖాయమని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News