Thursday, January 23, 2025

కాంగ్రెస్.. రైతు వ్యతిరేక పార్టీ: నిరసనలకు పిలుపునిచ్చిన బిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఈరోజు, రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) పార్టీ పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో ఉచిత విద్యుత్ రద్దు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన బయటపడింది. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుంది.దీన్ని తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలి” అని కోరారు.

Also Read: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో మరో 19మంది అరెస్ట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News