Tuesday, January 14, 2025

గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలా?

- Advertisement -
- Advertisement -

బేడీలతో ఆసుపత్రికి తీసుకురావడం అమానవీయం
అది వారి హక్కులను హరించడమే బేషజానికి
పోకుండా లగచర్ల కేసులు ఎత్తివేయాలి రైతులను
విడుదల చేయాలి బేడీల ఘటనపై సమగ్ర విచారణకు
ఆదేశించాలి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైర్

లగచర్ల వి షయంలో రేవంత్ రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తే సి రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురువారం నందినగర్‌లోని తన నివాసంలో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి ఈగోకు పోవడం తో గిరిజన రైతుల ప్రాణాలకు మీదకొచ్చిందన్నారు. జైలులో ఉన్న హీర్యానాయక్‌కు గుండెపోటు వస్తే కుటుంబసభ్యులకు తెలియనీయకుండా ఉంచడం దారుణమని ఆ వేదన వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిన వ్యక్తిని అంబులెన్స్‌లో తీసుకురాకుండా బే డీలు వేసి ఆస్పత్రికి తీసుకురావటం అమాననీయమని చెప్పారు. గుండెపోటు వచ్చిన రైతుకు ప్రభుత్వం స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సి ఉండగా బేడీ లు వేసి తీసుకురావడం శోచనీయమని ఆం దోళన వ్యక్తం చేవారు. రాజ్యాంగంలోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం వారి హ క్కులను హరించడమే అని స్పష్టం చేశారు.

నూతన క్రిమినల్ చట్టం బిఎన్‌ఎస్‌ఎస్ ప్రకా రం, పోలీస్ మాన్యువల్స్, జైల్ మాన్యువల్స్ ప్రకారం అండర్ ట్రయల్స్ ఖైదీల హక్కులను హరించడమేనని వెల్లడించారు. హీ ర్యా నాయక్‌కి గుండెల్లో నొప్పి వస్తే వైద్య స హాయం అందించడంలో ప్రభుత్వం అలస త్వం చూపిందని మండిపడ్డారు. ఆయనకు గురువారం ఉదయం రెండోసారి మళ్లీ గుం డెపోటు రావడంతో అతడిని సంగారెడ్డి ఆ సుపత్రికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. ఆ యనతో పాటు రాఘవేంద్ర, బసప్ప ఆరో గ్యం కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డికి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. రే వంత్ రెడ్డి ప్రెస్టేజ్‌కి పోయి పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయించారని మండిపడ్డా రు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కె టిఆర్ కోరారు. గవర్నర్ ఈ అంశంలో తగి న విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశా రు. తనపై ఎలాంటి దాడి జరగలేదని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ చెప్పినా కూడా ప్రభు త్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకొని వారిపై కేసులు పెట్టించడం అహంకారానికి నిదర్శనమని, లగచర్ల రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మానవీయకోణంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News