Monday, January 20, 2025

బిజెపి మనకు అవసరమా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్రమోడీపై కెటిఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన గురువారం ట్వీట్ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపుబోర్డు, మెట్రో రెండో దశ లేదని ప్రధాని చెప్పారు. ఐటిఐఆర్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని మోడీ చెప్పారు. తెలంగాణకు ఏదీ ఇచ్చేది లేదని మోడీ సర్కార్ చెప్పిందని వివరించారు. ప్రధాని మోడీ ప్రాధాన్యతలో అసలు తెలంగాణే లేనప్పుడు తెలంగాణ ప్రజల ప్రాధాన్యతాక్రమంలో ప్రధాని మోడీ ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కులిన పార్టీ ఎందుకుండాలి? అని కెటిఆర్ సూటిగా ప్రశ్నించారు.

ఆ నలుగురు బిజెపి ఎంపిలదే బాధ్యత

ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను మోడీ ప్రభు త్వం దారుణంగా ఉల్లంఘించినందుకు తెలంగాణకు చెందిన నలుగురు వెన్నెముక లేని బీజేపీ ఎంపిలు బాధ్యత వహించాలని మరో ట్వీట్ ద్వారా కెటిఆర్ అన్నారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ నిరాకరించబడినప్పుడు, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌కు 20,000 కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ లభిస్తుందని ఎద్దేవా చేశారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్బాగ్యులను ఎన్నుకున్న ఫలితం ఇదేనని మంత్రి కెటిఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 ఏప్రిల్ 2022న దాహోద్‌లో కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. దాహోద్ యూనిట్ గుజరాత్‌లోని మొదటి, భారతదేశంలో నాల్గవ రైల్వే తయారీ యూనిట్. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, టర్మరిక్ బోర్డు మంజూరు చేయబోమని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత బోర్లకుంట, కవితా మాలోతు, దయాకర్ పసునూరి, గడ్డం రంజిత్ రెడ్డి నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఎదుర్కొంటున్న అడ్డంకులపై ప్రశ్నలు సంధించారు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ స్పైసెస్ బోర్డ్ యాక్ట్, 1986 ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన స్వయంప్రతిపత్తి సంస్థ అయిన పసుపు బోర్డు, కొత్తిమీర, మిరపకాయలతో సహా 52 సుగంధ ద్రవ్యాలను ప్రోత్సహించే బాధ్యతను అప్పగించింది. అందుకే, దేశంలో పసుపు బోర్డు లేదా మరేదైనా మసాలా-నిర్దిష్ట బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో కేంద్రం హామీ ఇచ్చిన విధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రశ్నించగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. ‘తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు‘ అని తేల్చేశారు.‘ఇప్పటికే మంజూరైన ఫ్యాక్టరీలు సమీప భవిష్యత్తులో భారతీయ రైల్వే రోలింగ్ స్టాక్‌ల అవసరాన్ని తీర్చడానికి సరిపోతాయి‘ అని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News