Saturday, March 1, 2025

పండుగపూట పస్తులుంచడమే ప్రజాపాలనా?

- Advertisement -
- Advertisement -

శివరాత్రి నాడు కొండనాగుల ఎస్‌టి బాలుర హాస్టల్‌లో వంట
చేయకపోవడం దారుణం పైగా గుడికి వెళ్లి తినమని చెప్పడం
సిగ్గుచేటు ఎక్స్ వేదికగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్టకు చేరిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. విషాదంలోనూ మంత్రులు వినోదం పొందుతున్నారని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు హెలికాప్టర్ యాత్ర లు.. చేపకూర విందులు చేసుకుంటుంటే, హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్నం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్ ప్రజా ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ‘అన్నం వండలేదు గుడిలో తి నండి’ అని విద్యార్థులకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల ఎస్‌టి బాలుర హా స్టల్ సిబ్బంది ఆదేశాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాలుర హాస్టల్లో శివరా త్రి పండుగరోజు 380 మందికి గాను 200 మంది విద్యార్థులు ఉన్నారని అన్నా రు. అ యితే మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి వెళ్ళి తి నాలని, రాత్రి భోజనం కోసం వీరం రామాజిపల్లిలోని గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినమని విద్యార్థులకు చెప్పి హా స్టల్ సిబ్బంది వంట చేయడం మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం కోసం అంతదూరం నడిచి వెళ్ళే ఓపిక లేక ప స్తులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News