Saturday, November 23, 2024

నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/బాన్సువా: కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు ఆరోజు.. సీ టుకు నోటు ఈరోజు అంటూ రేవంత్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బిజెపిలు తెలంగాణను మోసం చేసినవేనని, నిజామాబాద్‌లో ప్రధాని మోడీ పచ్చి అబద్ధ్దాలు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన బాన్సువాడ పట్టణంలో నూతన పు రపాలక భవనం, ట్రాఫిక్ సిగ్నల్, అంబేద్కర్ సం ఘ భవనం, బాబు జగ్జీవన్ రాం విగ్రహావిష్కరణ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం వీక్లీ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  మాట్లాడారు.

రాష్ట్రంలో పుట్లకు పుట్లు వడ్లు పండిస్తుంటే కేంద్రానికి కడుపు మండుతుందని, అందుకే కొర్రీలు పెడుతుందన్నారు. 60 ఏండ్లు అభివృద్ధి చెయ్యని వారికి ఓటు వేస్తారో.. 9 ఏండ్లలో అభివృద్ధి ఏంటో చూపిన వారికి ఓటు వేస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. 60 ఏండ్లు సావగొట్టింది కాక మళ్లీ 3 గంటల కరెంట్ సరిపోతది అనే చెప్పే నాయకుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. 24 గంటల కరెంట్‌తో పాటు రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్ రూంలు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు ఇలా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనన్నారు. గతంలో నీళ్ల కోసం గల్లీల్లో లొల్లి జరిగేదని, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాలు వచ్చి నీటి సమస్య తీరిందన్నారు. ఆనాడు ఎరువులు, విత్తనాల కోసం గతంలో చెప్పులు లైన్లు ఉంచే పరిస్థితి ఉండేదన్నారు. 2014కు ముందు ఎవరైనా చనిపోతే చావుకు వెళితే బోరు కాడ నీటి కోసం కరెంట్ వాళ్లకు ఫోన్‌చేసే పరిస్థితి దాపురించేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చిన మాదిరిగా మాయమాటలు చెప్పే మాయగాళ్లు వస్తున్నారని, తస్మాత్ జాగ్రత్త అన్నారు. మాయమాటలు చెప్పే వారి మాటలు విని ఆగం కాకండి అన్నారు.
అందరినీ కడుపులో పెట్టి చూసుకునే నాయకుడు పోచారం
బాన్సువాడ నియోజకవర్గ ప్రజలందరికి కడుపులో పెట్టుకుని చూసుకునే నాయకుడు, మా అందరికి ఆదర్శ ప్రాయుడు, ఏడు పదుల వయస్సులో కూడా నిత్య యువకుడు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అని మంత్రి కెటిఆర్ అన్నారు. తండ్రికి తగ్గ తనయులుగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే రామలక్ష్మణులు పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డిలు అన్నారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా 11 వేల డబుల్ బెడ్ రూంలతో పాటు ఏకంగా 10 వేల కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిది అన్నారు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో సిఎం కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండడంతోనే సాధ్యపడిందన్నారు.

తెలంగాణ తిరుమలను రూ.30 కోట్లతో అభివృద్ధి చేశారని, ఇలా చెప్పుకుంటూ పోతే దినం సాలదన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, పోచారం రవీందర్ రెడ్డి, జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే, జడ్పీ చైర్‌పర్సన్ దఫెదార్ శోభ రాజు, రాష్ట్ర నాయకుడు వేణుగోపాల్, దఫెదార్ రాజు, ఎంపిపి దొడ్ల నీరజా వెంకట్రాం రెడ్డి, ఎఎంసి చైర్మన్ నేర్రె నర్సింలు, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, బంజారా నాయకుడు బద్యానాయక్, అంజిరెడ్డి, ఎర్వల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, పాత బాలకృష్ణ, గోపాల్ రెడ్డి, గురు వినయ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆర్‌డిఒ భుజంగ్ రావు, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News