Monday, December 23, 2024

55 ఏండ్లలో చేయని పనులను ఒక్క ఛాన్స్ ఇస్తే ఎలా చేస్తారు

- Advertisement -
- Advertisement -

మర్పల్లి : దేశంలో 55సంవత్సరాలు (11సార్లు) పాలించేందుకు అవకాశం ఇస్తే చేయని పనులను ఈసారి ఒక్క అవకాశం ఇస్తే ఏలా చేస్తారని,కాంగ్రెసోళ్లు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, అప్పట్లో రోజుకు 10గంటల పాటు కరేంట్ పోయిన అడిగే నాథుడే లేడని,మీరందరు బిఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వాదించి కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ సారే అవు తారని,తదనంతరం దేశంలోనే మన తెలంగాణను అన్నిరంగాల్లో నెంబర్‌వన్‌గా చేసుకుందామని,ఇండ్ల దగ్గరకు వచ్చి అగం, అగం అలోచనలను కల్పించే వారి మాటలను పక్కన పెట్టాలని, 2014కన్నాముందు ఎట్లుండే తెలంగాణ తర్వాత ఎట్లయింది తెలంగాణ మీరే అలోచించండి అని రాష్ట్ర పురపాలక,ఐటి శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు పెర్కొన్నారు.గురువారం ఆయన హెలిక్యాప్టర్‌లో వచ్చి పెట్రోల్‌బంకు నుండి ర్యాలీ నిర్వహిస్తూ రోడ్డుషోలో పాల్గోని మండలకేంద్రంలోని కొత్తబస్టాండ్ అవరణలో కెటిఆర్ మాట్లాడుతూ మన రాష్ట్రం మనకు కావాలనే ఉద్దెశ్యంతో కెసిఆర్ చావుదాక వెల్లారని వారు గుర్తు చేసారు.

కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తోమ్మిదిన్నరేండ్ల పాలనలో రెండు సంవత్సరాల పాటు కరోన రావడంతో సుమారుగా లక్షకోట్లరుపాయల ఆదాయం రాలేదని అన్నిరకాల ఎన్నికలకు సంవత్సరం పట్టిందని మిగతా ఆరున్నరసంవత్సరాల పాలనలో పలు రకాల సంక్షేమపథకాలను అమలు చేసుకున్నట్లు వారు పెర్కొన్నా రు.గతంలో మనకు వైద్యం అయినా ఏ జిల్లా అధికారిని కల్వలన్నా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు వల్లెవారని దినిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడి ప్రజల బాదలు, ఇబ్బందులు అక్కడనే తీర్చాలనే ఉద్దెశ్యంతో అందరికి అనుకూలంగా ఉన్న ప్రాంతంలో వికారాబాద్‌లో జిల్లా కేంద్రంను ఏర్పాటు చేయడం జరిగిందని, దినికి తోడు మెడికల్ కళాశాలను సైతం మంజూరు చేయడం జరిగిందని,దినిద్వార తక్కువ పిజుతో మన పిల్లలు వైద్య చదువులు చదివే అవకాశం ఉందని,500పడకలతో అన్నిరకాల జబ్బులకు వికారాబాద్‌లోనే వైద్యం అందుతుందని చిటికి, మాటికి హైదరాబాద్ వెల్లవలసిన అవసరం ఉండదని కేటిఆర్ తెలిపారు. రేవంత్‌రెడ్డితోపాటు కొందరు వ్యక్తులు కరేంట్ గురించి ఎక్కడుందని మాట్లాడుతున్నారని కరేంట్ ఎక్కడైనా కనపడుతుందా..అంటూ ప్రశ్నిస్తూ..కరేంట్‌గురించి మాట్లాడేటోళ్లు వచ్చి గ్రామంలోఉన్న కరేంట్‌వైర్లను వరుసకట్టి పట్టుకోని చూస్తే కరేంట్ ఉందా..

లేదా తెలుస్తుందని ఆయన పెర్కోన్నారు.అన్నివర్గాలకు అన్ని రకాలుగా మేలు చేస్తున్న బిఆర్‌ఎస్‌ను నమ్ముదామా.. ఆగం ఆగం మాట్లాడే కాంగ్రేసోళ్ల మాటలను నమ్ముదామాఅంటూ ఓటర్లకు వివరించారు. ఎంపి ఎన్నికల్లో మతం పేరుతో మంటలను రేపుతున్న బిజేపిని దేశంనుండి తరమికోట్టాలని కేటిఆర్ ఓటర్లకు విన్నవించారు. దేశంలో ఎక్కడ లేనివిదంగా సాగు చేసుకునేందుకు రైతులకు 24గంటలపాటు ఉచిత కరేంట్, పంట పెట్టుబడులకోసం రైతుబంధు,రైతులు ఎవ్వరైనా మరణిస్తే వారికుటుంబీకు రైతుబీమా ద్వార ఐదులక్షలరుపాయలను వారంరోజుల్లోనే వస్తున్నట్లు ఆయన పెర్కోన్నారు.ను.ఇప్పటివరకు రాష్ట్రంలో పదమూడున్నర లక్షలమందికి కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను లబ్ధ్దిదారులకు అందచేసినట్లు ఆయన గుర్తు చేసారు. దేశంలో ఉన్న మోది ప్రభుత్వం 1200వందలకు సిలిండర్‌ను ఇస్తే మన బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు కేవలం 400 చెల్లిస్తే మిగతా 800రుపాయలను ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే వారని ముఖ్యమంత్రికేసిఆర్ హాయంలో నేను వస్తాబిడ్డో సర్కారు దవఖానకు అంటున్నారని,

పుట్టిన మగ బిడ్డలకు రూ. 12 వేలు, ఆడ బిడ్డలకు రూ. 13వే లతో పాటు కేసిఆర్ కిట్‌ను అందచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 93లక్షల తెల్లరేషన్‌కార్డు దారులకు సన్నబియ్యంను సరఫరా చేయనున్నట్లు, కుటుంభాలకు బరోసానివ్వాలనే ఉద్దెశ్యంతో కేసిఆర్ జీవితబీమాను అమలు చేయనున్నటు తెలిపారు. దేశంలోనే మన రాష్ట్రం అత్యధికంగా బియ్యంను పండిస్తున్న రాష్ట్రమని ఆయన గుర్తు చేసారు.అసైండ్‌భూములకు హక్కులు కల్పిస్తామని,ప్రస్తుతమున్న 100గురుకులాల పాఠశాలలను రెట్టిం పుచేసా ్తమన్నారు. గతంలో 200పించన్‌లను ఇవ్వనోడు ఇప్పుడోచ్చి నాలు గువే యిలను ఇస్తామంటే ఎవ్వరు నమ్మోద్దని,వారిని నమ్మి ఓటేస్తే మోస పోతామని ఆయన తెలిపారు. మోమిన్‌పేట్‌లో పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగలకు ఉద్యోగ ఉపాదిఆవకాశలను కల్పిస్తామని, ఓట్లకోసం వచ్చె కాంగ్రెస్ వారు చెప్పె తియ్యటి మాటలను ఎవ్వరు నమ్మకూడదని చిత్తు, చిత్తుగా ఓడించాలని. 30తేదిన జరిగే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి ముచ్చటగా మూడవసారి మన బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసుకుని మన అభివృద్ధ్దిని మనమే చేసుకుందామని ఓటర్లకు మరోసారి విన్నవించారు.

మంత్రి మహెందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆనంద్,ఎంపి రంజీత్‌రెడ్డి ప్ర స గించారు. ఎంపిపి బట్టు లలీతా,జడ్‌పిటిసి మధుకర్, వైస్ ఎంపిపి మో హ న్‌రెడ్డి నాయకులు ప్రభాకర్‌గుప్త, మూడు మండలాల పార్టీ అధ్యక్షులు స ర్పంచులు, ఎంపిటిసిలు నాయకులు కార్యకర్తలు అదికసంఖ్యలో పాలొ ్గన్నా రు.మండలంలోని పలు గ్రామాలనుండి నాయకులు బాజబజంత్రీలతో, ఆటలు,ఆడుతూ పాటలుపాడుతూ కేటిఅర్‌కు స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News