ఫార్ములా ఈ -కారు రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు మరో రోజు పాటు పొడిగించింది. ఫార్మూలా- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచా రించింది. ఈ నెల 21న కెటిఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై డిసెంబర్ 30 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఎసిబిని ఇంతకుముందు ఆదేశిం చిన విషయం విదితమే. ఆ తర్వాత విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. దీంతో శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ నెల 31 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. తనపై ఎసిబి నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కెటి ఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కెటిఆర్‌ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఎసిబి, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది. కేసులో ‘కేటీఆర్ నాట్ టు అరెస్ట్’ను ఎత్తివేయాలని ఎసిబి పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కెటిఆర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
కౌంటర్ దాఖలు చేసిన ఎసిబి
ఈ కేసులో హైకోర్టులో ఎసిబి అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కెటిఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేయాలని కోరుతూ మరో పిటిషన్‌ను వేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు డిసెంబర్ 31కి వాయిదా వేసింది. ఈ కేసులో కెటిఆర్‌ను విచారించాలని ఎసిబి కోరుతోంది. ఈ దశలో ఆయనకు బెయిల్ మంజూరు చేసినా, ఆయనకు ఎలాంటి రిలీఫ్ ఇచ్చినా విచారణకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ పిటిషన్‌లో ఎసిబి అధికారులు పేర్కొన్నారు. ఈ కారణంతో కెటిఆర్‌ను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలను ఎత్తివేయాలని కోరారు. అంతేకాదు ఈ కేసులో ఫిర్యాదుదారుడైన పురపాలకశాఖ కార్యదర్శి దానకిషోర్ సైతం కౌంటర్ దాఖలు చేయనున్నారు.
ఇప్పటికే దానకిషోర్ వాంగ్మూలాన్ని ఎసిబి అధికారులు నమోదు చేశారు.
కాగా, బిఆర్‌ఎస్ సర్కార్ హయాంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ-కారు రేస్ నిర్వహణలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగిం దంటూ వచ్చిన ఫిర్యాదుపై ఎసిబి కేసు నమోదు చేసింది. అయితే, కేసులో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కెటిఆర్ పేరును అధికారులు ఎ1గా చేర్చారు. ఈ క్రమంలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కెటిఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని సూచించింది.