- Advertisement -
హైదరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో భాగంగా బాణాసంచా కాల్చి ప్రజలకు ఇబ్బంది కలిగించారని కెటిఆర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ పై ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టి వేయాలని బిఆర్‌ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది.
- Advertisement -