Monday, December 23, 2024

పాదయాత్రకు రెడీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: పార్టీ కా ర్యకర్తలంతా కోరుతున్నందున భవిష్యత్తు లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తానని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ ప్రకటించారు. దీపావళిరోజు ఎ క్స్ వేదికగా జరిగిన ఆస్క్ కెటిఅర్‌లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కెటిఅర్ సమాధానమిచ్చారు. పలువురు ప్రత్యేకం గా ఈ అంశంలో కెటిఅర్ అభిప్రాయాన్ని కోరారు. దేశంలోని అనేక పార్టీల నేతలు, ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నా రు. మీరేప్పుడు చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కెటిఅర్ కచ్చితంగా తన పా దయాత్ర ఉంటుందని వెల్లడించారు. దా దాపు గంటన్నపాటు సాగిన ఈ సంభాషణలో కెటిఅర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు.

కాంగ్రెస్ తెలంగాణకు శాపం
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారిందని కెటిఆర్ పేర్కొన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశాలు ఏమాత్రం లేవు అని, అందుకే అబద్ధాల మీద, అసత్యాల మీద సమయం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గత పది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదని చెప్పారు. అబద్ధపు హామీల మీద ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేమని అన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించిందని, అయితే వీటికి భయపడేది లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. నాలుగు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడం ఖాయమని అయితే కొత్త ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేసిన నష్టం నుంచి తెరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాలుగా మారుతుందని తెలిపారు. ప్రజల పక్షాన కోట్లాడడమే ప్రస్తుత భాధ్యత : ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడం పైన ప్రధానంగా దృష్టి సారించామని కెటిఆర్ వెల్లడించారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో పాటు తీసుకున్న నిర్ణయాలలో పారదర్శకత పైన ప్రజల తరఫున కొట్లాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అప్పుడే బలమైన ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని రాజ్యాంగబద్ధంగా మార్చే అవకాశం ఉన్నదా..? అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిందే పేర్కొన్నారు.

రాజకీయాలు వదిలేయానుకున్నా : తాము అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో ఏనాడు ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదని అన్నారు. దాదాపు రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు, రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురైన విషయాన్ని కెటిఆర్ ప్రస్తావించారు. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్ధంకాదని, ఈ విషయం తనకు అత్యంత బాధ కలిగిస్తుందన్నారు. నీచమైన రాజకీయాల కోసం తన కుటుంబాన్ని లాగుతున్న ముఖ్యమంత్రి పైన, ఆయన వందిమాగదుల పైన ప్రజల మద్దతుతో పోరాటం చేస్తానని చెప్పారు.

మూసీ ప్రక్షాళన అతిపెద్ద స్కామ్‌గా నిలవబోతున్నది : మూసీ బ్యూటిఫికేషన్‌కి తాము వ్యతిరేకం కాదు అని, కానీ మూసీ లూటిఫీకేషన్‌కి వ్యతిరేకం అని కెటిఆర్ అన్నారు. మూసీ ప్రక్షాళణ దేశంలోనే అతిపెద్ది అవినీతి స్కాం అవుతుందని జోస్యం చెప్పారు. హైడ్రా కేవలం కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుందని, ఇప్పటిదాకా ఒక్క పెద్ద బిల్డర్‌ని కూడా హైడ్రా ముట్టుకోలేదని చెప్పారు. కేవలం పేదలను మధ్యతరగతి ప్రజలను మాత్రమే నిర్దయగా దోచుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేవారు.మూసీ నది ప్రక్షాళన అనేది దేశంలోనే అతిపెద్ద అవినీతి స్కామ్‌గా నిలవబోతున్నదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో పార్టీ మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా బాగా యాక్టివ్‌గా మారారన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ తరఫున ఏం ఆశించకుండానే అద్భుతంగా పనిచేస్తున్నారని, వారి మద్దతును పార్టీకీ సోషల్ మీడియా వారియర్లు అందిస్తున్నారని చెప్పారు. ఇంత బలమైన సోషల్ మీడియా బృందాన్ని కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణకు వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న ప్రధాన స్రవంతి మీడియాకి ప్రత్యామ్నాయం సోషల్ మీడియా మాత్రమే అని అభిప్రాయపడ్డారు.

వచ్చే ఏడాది జనంలోకి కెసిఆర్ : తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు తెలంగాణ పదం ఉన్నన్ని రోజులు కెసిఆర్ పేరు నిలిచే ఉంటుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన పార్టీని, తమ నాయకులందరికీ ఎప్పటికప్పుడు ఆయా అంశాల పైన మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కొత్తగా ఎన్నికైన ఈ ప్రభుత్వానికి ఇచ్చిన 420 హమీలు అమలు చేసేందుకు సరిపడా సమయం ఇచ్చారన్నారు. నూతన సంవత్సరం తర్వాత కెసిఆర్ జనంలోకి వస్తారని, 2025లో ఆయన నుంచి మరిన్ని కార్యక్రమాలను చూస్తామన్నారు. ప్రస్తుతం తమ విధులు మరిచి, చట్ట విరుద్ధంగా బిఆర్‌ఎస్ కార్యకర్తలు నాయకులపైన రెచ్చిపోతున్న పోలీస్ అధికారులను గుర్తుపెట్టుకుంటామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహారాష్ట్ర ఎన్నికల్లోను జాతీయ పార్టీలను ప్రజలు నమ్మవద్దని,

అక్కడి స్థానిక పార్టీలకు ఓటు వేయాలని సూచించారు. తమిళనాడు విజయ్ దళపతి ప్రారంభించిన రాజకీయ పార్టీకి శుభాకాంక్షలు కెటిఆర్ తెలిపారు. రాజకీయపరమైన అంశాల పట్ల విభేదాలే తప్ప తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి అగ్ర నాయకులందరితో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉన్నదని అన్నారు. ప్రస్తుతం తాము ప్రతిపక్షంలో ఉన్నందున నిబద్ధత కలిగిన, బలమైన నూతన నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశం తమకు వచ్చిందని తెలిపారు. పార్టీ మారిన 10 మంది అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయని జోస్యం చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం బిజెపి చేస్తున్న మరొక జుమ్లా అయి ఉంటుందని, అయితే వారు తీసుకువచ్చే చట్టం ఎలాంటిదో చూడాల్సిన అవసరం ఉందని, తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది అసాధ్యం అని పేర్కొన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు తన పూర్తి మద్దతు ఉంటుందని, పార్టీ తరఫున వారికి అండగా ఉంటామని చెప్పారు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకువస్తామని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News