పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మంత్రులు కెటిఆర్, జగదీశ్‌రెడ్డి
చనిపోయిన కుటుంబానికి రూ.18లక్షలు అందజేత
జగదీష్ పెద్ద కుమారుడు సచిన్‌కు అమెరికా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసిన ఎంపి రవిచంద్ర
చిన్న కుమారుడు తరుణ్ కు ఉద్యోగం ఇప్పిస్తానని కెటిఆర్ భరోసా
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రమాదవశాత్తు మృతి చెందిన టిఆర్‌ఎస్ కార్యకర్త తాడిశెట్టి జగదీష్ కుమార్ కుటుంబానికి మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మేయర్ బొంతు రాంమోహన్‌లు కొండంత అండగా నిలిచారు. మునుగోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన నారాయణ పురం మండలం పుట్టపాకలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలై తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే రవిచంద్ర హైదరాబాద్ హస్తినాపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి, కుటుంబాన్ని ఓదార్చారు. జగదీష్ అంత్యక్రియల ఖర్చులతో పాటు పెద్ద కుమారుడు సచిన్ అమెరికా నుంచి వచ్చి వెళ్లడానికి వద్దిరాజు విమాన టిక్కెట్లు సొంతంగా ఏర్పాటు చేశారు. అలాగే సోమవారం రవిచంద్రతో పాటు రాంమోహన్ రామంతాపురంలోని నివాసానికి వెళ్లి జగదీష్ సతీమణి పద్మజ, కుమారులు సచిత్, తరుణ్ లను పరామర్శించి రూ.18 లక్షలు అందజేశారు. తరుణ్‌కు త్వరలో ఉద్యోగం ఇప్పిస్తానన్న కెటిఆర్ భరోసా గురించి బొంతు రాంమోహన్ వారికి తెలిపారు.
KTR gives Rs18 lakh cheque to Kin of deceased TRS Worker