Saturday, November 23, 2024

ఇల్లు.. పెళ్లి

- Advertisement -
- Advertisement -

KTR hands over 248 double bedroom houses to beneficiaries

సంక్షేమం, అభివృద్ధి

దేశంలో మరెక్కడా లేని మంచి పాలన
అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్ బన్సీలాల్‌పేట్ డివిజన్‌లో 248 డబుల్
ఇళ్లను పేదలకు అందించిన సందర్భంగా మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: పేదలకు పైసా ఖర్చు లేకుండా సొంతింటిని నిర్మించి ఇవ్వడంతో పాటు పేదింటి ఆడబిడ్డల పెళ్ళిలకు ఆర్ధికంగా చేయూతను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాత్రమేనని పురపాలక పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అభివృద్ధ్ది, సంక్షేమం ఈ రెం డింటినీ పూర్తిగా సమన్వయం చేస్తూ రా్రష్ట్రాన్ని పు రోభివృద్ధి చేస్తున్న ఘనత కూడా సిఎం కెసిఆర్‌దేనని తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సిలాల్ పేట్ డివిజన్ చాచా నెహ్రూనగర్ నిర్మించిన 248 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి కెటిఆర్ లబ్ధిదారులకు అందజేశారు.

(సిసి నగర్)లోరూ.19.22 కోట్ల వ్యయంతో నిర్మించిన 248 రెండు బెడ్ రూం ఇళ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, వేముల ప్రశాం త్ రెడ్డి, ఎంఎల్‌సి వాణిదేవి లతో కలిసి మంత్రి కెటిఆర్ శుక్రవారం ప్రారంభించారు. డబుల్ ఇళ్ల ప్రారంభోత్సం ఆనందోత్సావాల మధ్య జరిగింది. ఆడపడుచులు తెలంగాణ సంస్కృతి ప్రతిబింభిస్తూ బోనాలతో ఆహ్వానితులకు స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్ యల్. శర్మన్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, హౌసింగ్ సి.ఇ సురేష్, కార్పొరేటర్ హేమలత లక్ష్మి పతి, ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు.

రూ.18వేల కోట్లతో డబుల్ ఇళ్ల : మంత్రి కెటిఆర్

సిసినగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవ సభను ఉద్దేశించి మంత్రి కె.టి.ఆర్ మాట్లాడుతూ గేటెట్ కమ్యూనిటీలకు దీటైన ఇళ్లలో పేదలు ఆత్మగౌరవంతో బతుకాలన్నదే ముఖ్యమంత్రి లక్షామన్నారు. ఇందుకు రాష్ట్రంలో రూ. 18వేల కోట్ల భారీ బడ్జెట్ తో పేదల సొంతింటి కలను సిఎం కెసిఆర్ నిజం చేశారన్నారు. గృహ నిర్మాణానికి తెలంగాణలో పెట్టినంత ఖర్చు మిగతా 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేవని, ఇళ్లు కట్టి చూడు,పెళ్లి చేసి చూడు అని పెద్దలు చెప్పేవారని, ఈ రెండు కార్యాలను మన ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబంలో పెద్ద అన్నగా ఇళ్లు నేనే కట్టిస్తా, పేదింటి ఆడ పడుచుల పెళ్లికి షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలతో ఆర్థిక సాయం ద్వారా ఆభయ హస్తం అందిస్తున్నారని తెలిపారు.

ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు రూ.11వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తిచేసి పేదలందరికీఅందిస్తామని తెలిపారు. సిసి నగర్‌లో నిర్మించిన ఇళ్లకు మార్కెట్ విలువ రూ.40 లక్షల నుండి రూ.50 లక్షలవరకు ఉంటుందని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా కూడా భారం వేయకుండా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. దళారులను, పైరవీలకు అవకాశమే లేదని,ఇక్కడ ఉన్న వారికి న్యాయంజరుగుతుందని మంత్రి కె.టి.ఆర్ అన్నారు. తెలంగాణ రాకముందు సరిగ్గా బియ్యం వచ్చేవి కావు. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి 5 కిలోలచొప్పున బియ్యం పంపిణీ చేయడమేకాకుండ 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నామని వెల్లడించారు.

పేదలు గొప్పగా బతుకాలన్నదే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి తలసాని

పశు సంవర్థక మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేదలు గొప్పగా బ్రతకాలని, వారి నుంచి రూపాయి తీసుకోకుండా పూర్తిగా ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇవ్వడం దేశంలో మరెక్కడా లేదన్నారు. గతంలో 15, 20, 30 గజాలలో అరకొర వసతులతో ఉన్న పేదలకు సంపన్న వర్గాలకు దీటుగా ప్రస్తుతం అన్ని మౌలిక వసతులతో కూడిన 560 చ.అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఉచితంగా అందిస్తున్నామని, ఇక్కడ బస్తీలో ఉన్నవారికే న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్నవారు ఎక్కడికైనా వెళ్లినా వాళ్ల కోసం వారం రోజుల్లో ఇల్లు కేటాయింపు జరుపుతామని, అప్పటి వరకు ఓపికతో ఉండాలన్నారు. ఈ ఇళ్లను కొనడం, కానీ, అమ్మడం గానీ జరుగదని, తమ పిల్లలు తరతరాలుగా ఉపయోగించుకోవాలని తెలిపారు. నియోజకర్గప్రజలను 25 సంవత్సరాల పాటు కన్నబిడ్డల వలే కాపాడుకున్నామని అన్నారు. వారికి ఆపదవచ్చినప్పుడు అన్నివిదాల ఆదుకోవడం తన బాధ్యత అని గుర్తుచేశారు.

డబుల్ ఇళ్ల మన రాష్ట్రంలోనే డబుల్ ఇళ్లు : మహమూద్ అలీ

హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను కెసిఆర్ నిర్మిస్తున్నారని, నెహ్రూ జమానా నుండి పేదలకు ఎవ్వరూ కూడా గృహాలు నిర్మించలేదని, చాచా నెహ్రూ నగర్ లో గృహాలు నిర్మించిన ఘనత కె.సి.ఆర్ కే దక్కుతుందన్నారు. షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్ లాంటి పథకాలు భారతదేశంలో మరెక్కడాలేవన్నారు.

అర్హులందరికీ డబుల్ ఇళ్లు : మంత్రి ప్రశాంత్‌రెడ్డి

రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ న్యాయం జరిగే విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించడం జరుగుతుందని అన్నారు. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తిచేయడానికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతోఉన్నారు. ఇక్కడ ఇల్లు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News