మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు ముఖ్యమంత్రి పదవికి కావల్సిన అర్హతలన్నీ ఉన్నాయని రాష్ట్ర శాసన మంండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి చెప్పారు. శనివారం శాసనమండలిలో గుత్తసుఖేందర్ రెడ్డిని కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కెటిఆర్ గురిం చి ప్రస్తావించగా కెటిఆర్‌కు సిఎం పదవి బాధ్యతలు నిర్వహించేందుకు కావల్సినన్నీ అర్హతలు ఉన్నాయన్నారు. ప్రధానంగా పాలనా వ్యవస్థమీద పట్టు, అవగాహన, బహుభాషల్లో అనర్ఘలంగా మాట్లాడే భాషా పరిజ్ఞానం, అభివృద్ధి, సంక్షేమం పట్ల కెటిఆర్‌కు పూర్తి స్థాయిలో అవగాహన ఉందన్నారు.
ఈ నేపథ్యంలో పలువురు కెటిఆర్‌ను సిఎం గా కోరుకుంటున్నారన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఏకగ్రీవం అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నోముల నర్సింహయ్య మరణంతో ఇక్కడ జరగ నున్న ఎన్నికల్లో నోములపై అభిమానంతో రాజకీయ పార్టీలు ఏక గ్రీవానికి అవకాశం ఇస్తే మంచి సంప్ర దాయమవుతుందన్నారు. 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తనకు అధిష్టానం ఏబాధ్యతలు అప్పగించినా సమర్ధవంతంగా నిర్వహించడమే అలవాటు చేసుకున్నానని చెప్పారు. ప్రస్తు తం ఎంతో బాధ్యతగల పోస్టులో ఉన్నానని రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సి ఉంటుందని చెప్పారు. పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యూలేటరీ సామ ర్ధం పెంచితే తెలంగాణకు అన్యా యం జరుగుతుందన్నారు. ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్, గ్రీన్‌ట్రిబ్యునల్, కృష్ణానదీ యాజమాన్యం బోర్డు, కేంద్ర జలశక్తి శాఖ ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శ్రీశైలం నుంచి పోతిరెఎడ్డి పాడుద్వారా నీరు తరలిపోతే కృష్ణానదీ జలాలపై ఆధారపడిన మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడుతుందన్నారు. బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించనున్నారనేది ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ నిర్ణయిస్తారని చెప్పారు. బడ్జెట్ సమావేశాల తేదీలు ఇంకా ఖరారు కాలేదన్నారు.
KTR has all capabilities to become CM: Gutha Sukender